యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ (Sharwanand) ఇండస్ట్రీలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇన్నేళ్ల తన సినీ ప్రయాణంపై ఎమోషనల్ నోట్ రాశారు. మరోవైపు శర్వా బర్త్ డే సందర్భంగా స్టైలీష్ లుక్ వైరల్ గా మారింది.
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ తాజాగా 20 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. 2003 నుంచి సినీ ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఎన్నో ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం గల శర్వానంద్ టాలీవుడ్ లో మంచి గుర్తింపును సాధించుకున్నారు. ఈరోజుతో శర్వా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సరిగ్గా 20 ఏళ్లు పూర్తైంది. దీంతో అభిమానులు, ప్రేక్షకులు, ఆయన శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలుపుతూ ఎమోషనల్ నోట్ విడుదల చేశారు.
శర్వానంద్ విడుదల చేసిన నోట్ లో... ‘20 ఏళ్లు ఎన్నో పాత్రలు చేస్తూ, వెండితెరపై అందర్నీ అలరిస్తున్నాను. భావోద్వేగాలతో నిండిన ఈ ప్రయాణంలో 20 సంవత్సరాల స్నేహం, కష్టాలు, ఎత్తులు, లోతులు, చిరునవ్వులు ఎన్నో మెరెన్నో, అచంచలమైన ప్రేమ మరియు మద్దతుతో నా ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ 20 సంవత్సరాలు నా జీవితాన్ని, నా వ్యక్తిత్వాన్ని అద్భుతంగా మలిచాయి. నా ఈ ‘ఓకే ఒక జీవితం’ సినిమాకి అంకితం. 20 సంవత్సరాల కింద ‘శ్రీకారం’ చుట్టిన ఈ సినీ ‘ప్రస్థానం’ మరుపురానిది, మరువలేనిది. ఈ సినీ లోకం లో నా ‘గవ్యం’ ఎంతో దూరం. మిమ్మల్ని అలరించడం కోసం ప్రతి క్షణం ‘రన్ రాజా రన్’లా పరుగులు తీస్తూనే ఉంటాను. క్రుషి చేస్తూనే ఉంటాను. ‘శతమానం భవతి’ అంటూ మీరు నాకు ఇచ్చే ఆశీస్సులతో ఇది సాధ్యమవుతుందని నేను నమ్ముతున్నాను’ అంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎమోషనల్ నోట్ రాసుకోచ్చారు.
మరోవైపు శర్వానంద్ పుట్టిన రోజు కూడా ఇవ్వాలే కావడం విశేషం. మార్చి 6న 1984లో శర్వా జన్మించారు. ఈఏడాదితో 39 ఏటా అడుగుపెట్టారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా శర్వా తదుపరి చిత్రం Sharwa35 నుంచి ఓ క్రేజీ పోస్టర్ విడుదలైంది. శర్వాకు పుట్టిన రోజు శుభాకంక్షలు తెలుపుతూ చిత్ర యూనిట్ శర్వా స్టైలీష్ లుక్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం పోస్టర్ వైరల్ అవుతోంది. అయితే నెక్ట్స్ ఫిల్మ్ లో శర్వా మేకోవర్ చాలా స్టైలిష్ గా ఉంటుందని తెలుస్తోంది. తాజాగా విడులైన పోస్టర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. శర్వా న్యూ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
Sharwa35కి టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. కో- ప్రొడ్యూసర్ గా వివేక్ కుచిబోట్ల వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ‘హృదయం’ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీగా, ప్రవీణ్ పుడి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందనున్నాయి. చివరిగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’, ‘ఓకే ఒక జీవితం’తో అలరించారు. ఇక ఈఏడాది జనవరి 26న శర్వానంద్ - రక్షితా రెడ్డికి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.