Pushpa: నా అందం ఎలాగూ టివిలో చూస్తున్నారు, ఇక్కడ మాత్రం కంకణం కట్టుకున్నా..అనసూయ

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 12, 2021, 10:01 PM IST
Pushpa: నా అందం ఎలాగూ టివిలో చూస్తున్నారు, ఇక్కడ మాత్రం కంకణం కట్టుకున్నా..అనసూయ

సారాంశం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన హైఓల్టేజ్ యాక్షన్ మూవీ పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగం 'పుష్ప ది రైజ్' పేరుతో డిసెంబర్ 17న ఈ చిత్రం విడుదలవుతోంది. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో నేడు హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన హైఓల్టేజ్ యాక్షన్ మూవీ పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగం 'పుష్ప ది రైజ్' పేరుతో డిసెంబర్ 17న ఈ చిత్రం విడుదలవుతోంది. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో నేడు హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అల్లు అర్జున్ అభిమానులతో ప్రీ రిలీజ్ ప్రాంగణం జనసంద్రాన్ని తలపిస్తోంది. 

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు సునీల్, అనసూయ ప్రసంగించారు. సునీల్ మాట్లాడుతూ.. దాదాపు 300 సినిమాల్లో కమెడియన్ గా నటించా. ఆ తర్వాత హీరోగా కూడా చేశా. కానీ ఎప్పుడూ ఇలాంటి విలన్ గా నటించే ఛాన్స్ రాలేదు. ఈ అవకాశం అల్లు అర్జున్, సుకుమార్ గారి వల్లే వచ్చింది. అల వైకుంఠపురములో చిత్రం పెళ్లి భోజనం అయితే.. పుష్ప రిసెప్షన్ నాన్ వెజ్ విందులా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు అని సునీల్ అన్నారు. 

సిక్స్ ప్యాక్ చూపించినా నాకు విలన్ గా ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చింది. మిగిలిన భాషల గురించి నాకు భయం లేదు. ఎందుకటే వాళ్ళు ఎలాగు నన్ను విలన్ గానే చూస్తారు. కానీ తెలుగు ప్రేక్షకులు ఈ రోల్ ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే టెన్షన్ ఉంది. నా ముందు సినిమాల గురించి కాకుండా కేవలం విలన్ గానే నన్ను ఈ చిత్రంలో చూడండి అని సునీల్ రిక్వస్ట్ చేశాడు. 

ఇక అనసూయ మాట్లాడుతూ.. మీతో నటించాలని ఉందని అల్లు అర్జున్ గారిని కోరాను. వెంటనే వారంలోనే నాకు పుష్ప చిత్రంలో ఛాన్స్ వచ్చింది అని అనసూయ తెలిపింది. నా గ్లామర్ ని టివిలో చూస్తూనే ఉన్నారు. ఇక్కడ సినిమాల్లో మాత్రం మిమ్మల్ని సర్ ప్రైజ్ చేయాలనే కంకణం కట్టుకున్నా అంటూ అనసూయ చెప్పుకొచ్చింది. 

Also Read: Pushpa Pre Release event: బ్లాక్ శారీలో రష్మిక గ్లామర్ మెరుపులు.. తగ్గేదే లే అంటూ అదరగొట్టిన బన్నీ కూతురు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Varun Sandesh: అందుకే మాకు పిల్లలు పుట్టలేదు, వచ్చే ఏడాది గుడ్ న్యూస్ చెబుతామంటున్న హీరో
Nandamuri Balakrishna: గత 25 ఏళ్లలో బాలకృష్ణ బిగ్గెస్ట్ హిట్ ఏదో తెలుసా.. 32 సినిమాలు చేస్తే 10 హిట్లు