Pushpa: జనసంద్రంలా అల్లు అర్జున్ అభిమానులు.. హోరెత్తిపోతున్న యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 12, 2021, 08:50 PM IST
Pushpa: జనసంద్రంలా అల్లు అర్జున్ అభిమానులు.. హోరెత్తిపోతున్న యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్

సారాంశం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన హైఓల్టేజ్ యాక్షన్ మూవీ పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగం 'పుష్ప ది రైజ్' పేరుతో డిసెంబర్ 17న ఈ చిత్రం విడుదలవుతోంది. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో నేడు హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన హైఓల్టేజ్ యాక్షన్ మూవీ పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగం 'పుష్ప ది రైజ్' పేరుతో డిసెంబర్ 17న ఈ చిత్రం విడుదలవుతోంది. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో నేడు హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అల్లు అర్జున్ అభిమానులతో ప్రీ రిలీజ్ ప్రాంగణం జనసంద్రాన్ని తలపిస్తోంది. 

అల్లు అర్జున్ నినాదాలతో ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. ప్రీ రిలీజ్ వేడుకకు రాజమౌళి, కొరటాల శివ లాంటి స్టార్ డైరెక్టర్స్ అతిథులుగా హాజరయ్యారు. రష్మిక మందన బ్లాక్ శారీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైంది. 

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం ఇది. ఆర్య, ఆర్య 2 తర్వాత వీరిద్దరూ మరోసారి చేతులు కలిపారు. సుకుమార్ చిత్రాలు విభిన్నమైన కథలతో ఉంటాయి. ఈ చిత్రాన్ని సుకుమార్ ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ లుక్, గెటప్, బాడీ లాంగ్వేజ్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. 

ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు మరో స్థాయికి చేర్చింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక రష్మిక మునుపెన్నడూ లేని విధంగా పల్లెటూరి యువతి పాత్రలో అందాలు ఆరబోస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యంలో వచ్చిన అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bhooth Bangla: ఈ ఏడుగురు స్టార్స్ లో బాగా చదువుకుంది ఎవరో తెలుసా ? వీళ్ళ క్వాలిఫికేషన్స్ ఇవే
Tabu Real Name: టబు అసలు పేరేంటి? తండ్రి ఇంటిపేరు ఎందుకు వాడరు? ఆయనంటే ఇష్టం లేకపోవడానికి కారణం ఇదే