
ఇండియా మొత్తం సినీ అభిమానుల్లో RRR ఫీవర్ మొదలైంది. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ యూట్యూబ్ ని కుదిపేస్తోంది. అన్ని భాషల్లో రికార్డ్ వ్యూస్ నమోదవుతున్నాయి. రాంచరణ్, ఎన్టీఆర్ లని రాజమోళి సూపర్ హీరోలుగా ప్రజెంట్ చేస్తూ అదరగొట్టేశారు.
అల్లూరి సీతా రామరాజుగా Ram Charan, కొమరం భీంగా NTR సృష్టిస్తున్న విధ్వంసానికి జనవరి 7న థియేటర్లు హోరెత్తిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితమే సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ తొలిసారి ఆర్ఆర్ఆర్ ట్రైలర్ చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారో ఈ వీడియోలో చూపించారు.
రాజమౌళి, రమా రాజామౌళితో కలసి ఎన్టీఆర్, చరణ్ బిగ్ స్క్రీన్ పై ట్రైలర్ వీక్షించారు. ట్రైలర్ అదిరిపోవడంతో చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ సంతోషం ఆపుకోలేకపోయారు. రాజమౌళిని కౌగిలిలో బంధించి అల్లరి చేష్టలు చేశారు. వారి అల్లరికి రాజమౌళి గట్టిగా అరవడం వీడియోలో చూడొచ్చు.
రాంచరణ్ ట్రైలర్ మాములుగా లేదు అని అనగా.. ఎన్టీఆర్ అస్సలు ఏంటది అని కామెంట్ చేశాడు. రాంచరణ్ వన్స్ మోర్ వన్స్ మోర్ అని అనడం కూడా వీడియోలో చూడొచ్చు. సాధారణంగా తమ చిత్రాలని తాము చూసుకున్నప్పుడు హీరోలకు అంతగా ఎగ్జైట్మెంట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే వారికి సినిమా గురించి అన్ని విషయాలు తెలిసి ఉంటాయి. కానీ చరణ్ , తారక్ వారి చిత్ర ట్రైలర్ చూసి వారే ఈ రేంజ్ లో సంతోషానికి గురయ్యారంటే ఇక సినిమా ఎలా ఉండబోతోందో ఊహించడం కష్టం. ఈ వీడియో రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ మధ్య బాండింగ్ ని తెలియజేసేలా ఉంది.
ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో కూడా వీరి ముగ్గురి మధ్య సరదాగా సంఘటనలు జరిగాయి. ఎన్టీఆర్ రాజమౌళిని గిల్లడం.. వీరిద్దరూ చేసే అల్లరి గురించి జక్కన్న మీడియాకు వివరించడం అభిమానులకు చాలా సరదాగా అనిపించింది.
ట్రైలర్ విడుదలయ్యాక ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో మీడియా సమావేశాలు నిర్వహించింది. ఈ కార్యక్రమాలని అలియాభట్ కూడా హాజరైన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ చిత్రం జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. బాహుబలితో యావత్ దేశాన్ని అబ్బురపరిచిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో ఎలాంటి బెంచ్ మార్క్ సెట్ చేయబోతున్నారో చూడాలి.
Also Read: Rajamouli: దటీజ్ రాజమౌళి.. వరల్డ్ టాప్ 50 దర్శకులలో రాజమౌళి, ఏకైక భారతీయుడు జక్కన్నే