Pushpa Romantic Scene: పుష్ప మూవీ నుంచి ఆ... సీన్ కట్... అంత ఘోరంగా ఉందా..?

By Mahesh Jujjuri  |  First Published Dec 18, 2021, 5:34 PM IST

పుష్ఫ మూవీలో ఓ సీన్ పై పెదవి విరుస్తున్నారు ఫ్యామిలీ ఆడియన్స్. ఇదేంటి.. అందరూ చూసే సినిమాలో.. ఇదేం సీన్ అంటూ.. తిట్టుకుంటున్నట్టు తెలుస్తుంది.


అల్లు అర్జున్‌(Allu Arjun) – రష్మిక(Rashmika) జంటగా సుకుమార్(Sukumar) డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా పుష్ప. భారీ అంచనాల నడుమ నిన్న(డిసెంబర్ 17న) పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా... మొత్తానికి పాజటీవ్ రెస్పాన్స తో బయట పడింది. బన్నీ, సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన  హ్యాట్రిక్‌ మూవీ కావడంతో..  అందరి చూపు ఈ సినిమాపైనే పడింది. అటు ఒక రోజు కలెక్షన్ల విషయంలో కూడా నిరాశపరచలేదు సినిమా. ప్రపంచవ్యాప్తంగా పుష్ప ఒక్క రోజులో దాదాపు 70 కోట్ల కలెక్షన్స్ సాధించినట్టు నిర్మాతలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు.

 

Latest Videos

అంతా బాగానే ఉంది. కాని సినిమా విషయంలో మాత్రం ఓ చిన్న సీన్ ఫ్యామీలీ ఆడియన్స్ ను ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తోంది. మొదటి రోజు రివ్యూలో ఆ సీన్ గురించి హాట్ టాపిక్ నడిచిందట. పుష్ప‌-శ్రీ‌వ‌ల్లీ మ‌ధ్య సెకండాఫ్‌లో ఓవర్ రోమాంటిక్ సీన్ ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తోంది.  అల్లు అర్జున్ శ్రీ వల్లి భుజం పై చేయి వేసి ఫోన్ మాట్లాడుతూ...చేయి శ్రీవల్లి ప్రైవేట్ పార్ట్స్ పై వేసినట్లుగా చూపించారు. ఆసీన్ ను చాలా మంది  చూడలేక పోయారు. ముఖ్యంగా ఫ్యామిలీతో వచ్చినవారికి ఈ సీన్ ఎబ్బెట్టుగా అనిపించినట్టు సమాచారం.

Also Read : Roundup 2021-firstday collections: పవన్‌ని కొట్టలేకపోయిన బన్నీ.. బాలయ్య, రవితేజ ఈ ఏడాది ఎవరి లెక్క ఎంత ?

సుకుమార్ సినిమాల్లో ఇలాంటి సీన్లు కనిపించవు. అసలు ఉండవుకూడా. ఇది కచ్చితంగా సుకుమార్‌ మార్క్‌ కాదు. సుకుమార్ మీద నమ్మకంతో ఉన్నవాళ్ళు.. ఫస్ట్ డే సినిమా చూసి అవాక్కైనట్టు తెలుస్తంది.  ఫీడ్ బ్యాక్ లో ఈ సీన్ గురించి ఉండటంతో.. డైరెక్టర్ సుకుమార్ వరకూ  ఈ విషయం వెళ్లిందట. దాంతో  ఆ సీన్‌ తీసివేయాలని ఆయన ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈరోజు ఎలాగో గడిచిపోవడంతో.. ఆదివారం నుంచి ఈ ఓవర్ రోమాంటిక్  సీన్‌ లేకుండా ఎడిటింగ్ చేయాబోతున్నట్టు సమాచారం.

click me!