
లాస్ట్ నెల రోజుల నుంచి మీడియాలో అంతా.. విక్కీ కౌశల్(VIcky Kaushal), కత్రినా కైఫ్ (Katrina Kaif )మ్యారేజ్ హడావిడే సరిపోయింది. ఈ బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ మీడియాకు దొరక్కుండా చాలా ఏళ్లు ప్రేమించుకున్నారు.. చాలా ఏళ్ల పాటు సహజీవనం కూడా చేసుకుని.. ఆ తర్వాత పెళ్లి పీటలెక్కారు. డిసెంబర్ 9న రాజస్థాన్‌లో వీరిపెళ్ళి అంగరంగవైభవంగా జరిగింది. ఈ పెళ్లికి బాలీవుడ్‌కు చెందిన చాలామంది సినీ సెలబ్రెటీలు వెళ్ళి... ఈ జంటను ఆశీర్వదించారు.
గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డిండ్ చేసుకున్న బాలీవుడ్ కపుల్ పెళ్లి తర్వాత వెంటనే ముంబైకి వచ్చేసింది. ఇలా వచ్చారో లేదో అలా ఎవరి పనిలో వారు మునిగిపోయారు. ఒక వారం అంటే వారం గ్యాప్ ఇచ్చి.. వెంటనే కొత్త పెళ్లికొడుకు VIcky Kaushal షూటింగ్‌కు రెడీ అయ్యాడు. తను కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేయడానికి సై అంటున్నాడు. ఫ్రెష్‌గా సెల్ఫీ తీసి తన ఇన్‌స్టా లో షేర్ చేశాడు విక్కీ. ముందు టీ.. ఆ తర్వాత షూటింగ్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు.
Also Read: BIGG BOSS WINNER SUNNY: బిగ్ బాస్5 టైటిల్ సన్నీదే... ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా...?
విక్కీ కౌశల్ పెళ్లయిన వారానికే షూటింగ్(Shooting) లో బిజీ అయిపోతే.. మరి కత్రినా ఎక్కడ? కత్రినా కైఫ్(Katrina Kaif )తో ఓ ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్టు.. అంటూ నెటిజన్లు విక్కీని అడుగుతున్నారు. అంతే కాదు పెళ్లై వారం కూడా కాలేదు అప్పుడే షూటింగ్ ఏమిటి కౌశల్.. హనీమూన్ ప్లానింగ్స్ ఏం లేవా అంటూ నెటిజన్లు చమత్కారాలు ఆడుతున్నారు. ఇది ఇలా ఉంటే.. అక్కడ అత్తగారింటో కత్రీనా కొత్త అవతారం ఎత్తింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గరిటె పట్టుకుని వంట చేసింది. తన భర్త కోసం. అత్తగారి కోసం సుజి కా హల్వాను తయారు చేసింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది Katrina Kaif. ఇక ఈ హాల్వా తిని ఇంత వరకూ ఇలాంటి టేస్టీ హల్వా తినలేదంటూ... భార్యను తెగ పొగిడేస్తున్నాడు విక్కీ కౌశల్.