ఈ చిత్రం ఫస్ట్ పార్ట్‌ని 'పుష్ప: ది రైజ్' పేరుతో విదలైంది. వచ్చే ఏడాది రెండో భాగం రానుంది. అయితే సెకండ్ పార్ట్‌కు ఏ పేరు పెడతారో అని బన్నీ అభిమానులు, సినీ ప్రేక్షకుల్లో ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అల్లు అర్జున్ తాజా చిత్రం 'పుష్ప: ది రైజ్' విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే సినిమా ఎలా ఉన్నా అల్లు అర్జున్ నటన, యాక్షన్ సీన్లకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీనికి సీక్వెల్ గా 'పార్ట్-2' కూడా విడుదలవుతుందని టీమ్ ఇప్పటికే ప్రకటించింది. 'పుష్ప: ది రూల్'(Pushpa: The rule) టైటిల్‌తో రానున్న ఈ సినిమాపై ఇప్పుడు ఓ చిత్రమైన చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.
వాస్తవానికి ఈ సీక్వెల్ పై రిలీజ్ కు ముందు నుంచీ మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్టా పార్ట్ లో ఒక సాధారణ కూలీగా జీవితం మొదలు పెట్టిన పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియాను శాసించే స్థాయికి ఎలా ఎదగాడన్నది అదిరిపోయేలా చూపించారు దర్శకుడు సుకుమార్. అయితే సినిమాలో చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండానే వదిలేశారు. దీంతో సెకండ్ పార్ట్ అవన్నీ క్లియర్ చేయబోతాయని అర్దమైంది. అయితే సీక్వెల్ కు వదిలిన లీడ్ ఏమాత్రం ఆసక్తి రేపలేకపోయింది.
నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు వస్తుందా? అని ప్రేక్షకుల ఎదురుచూసే విధంగా ఫస్ట్ పార్ట్ సినిమా క్లైమాక్స్ లేదు. హా ‘బాహుబలి’ పార్ట్ 1కు రాజమౌళి అద్భుతమైన క్లైమాక్స్ ఇచ్చి రెండవ పార్ట్ ను ఎనలేని క్రేజ్ ను తీసుకువచ్చారు. ఇక “కేజీఎఫ్”కూడా అంతే. 2022లో ది మోస్ట్ అవైటెడ్ జాబితాలో ఇండియాలో నెంబర్ 1 స్థానాల్లో “కేజీఎఫ్ 2” ఉంది. “కేజీఎఫ్”,బాహుబలి రేంజ్ క్లైమాక్స్ “పుష్ప”లో కొరవడిందనేది విమర్శకుల మాట. దీంతో “పుష్ప పార్ట్ 2″పై ప్రేక్షకుల ఇంట్రస్ట్ లేకుండా పోయిందనే టాక్ స్ప్రెడ్ అవుతోంది. సోషల్ మీడియాలో కొందరైతే “పుష్ప 2” ఉండే అవకాసం లేదంటున్నారు. కాకపోతే పార్ట్ 2 ఎట్టిపరిస్దితుల్లోనూ ఉంటుందనేది ఇండస్ట్రీ మాట. అభిమానులు కూడా ఖచ్చితంగా ఈ సినిమాకు సీక్వెల్ తీస్తారంటన్నారు. వాళ్లు ఘాటు రిప్లైలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.
పార్ట్-1లో మంగళం శ్రీనుగా విలన్గా పాత్రలో సునీల్ సరికొత్తగా కనిపించారు. రెండో భాగంలో ఈ పాత్రను మరింత క్రూరంగా చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా పుష్పరాజ్‌ను ఎదుర్కొనే దీటైన పాత్రగా మరోసారి సునీల్‌కు ఎలివేషన్ లభించవచ్చు అంటున్నారు. అలాగే 'రంగస్థలం'లో రంగమ్మత్తగా చెరగని ముద్రవేసిన అనసూయ ఇందులో ద్రాక్షాయణిగా కనిపించింది. పార్ట్-1లో ఈ పాత్రకు సంబంధించిన ఆమెకు అంత గొప్ప సీన్స్ ఏమీ కనిపించలేదు. 'పుష్ప: ది రూల్'లో ఉంటుందంటున్నారు.
ఇక ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్‌గా సెకండాఫ్ చివర్లో ఫహద్ ఫాజిల్ పాత్ర పరిచయమైంది. రెండో భాగంలోనూ ఇది కొనసాగనుంది. తొలి భాగంలో పుష్పరాజ్ నుంచి ఎదురైన అవమానానికి భన్వర్‌సింగ్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడన్న దాన్ని పార్ట్-2లో చూపించనున్నారు.