Anasuya: అనసూయ ఇంటిలో తీవ్రవిషాదం... తండ్రి అకాల మరణం!

Published : Dec 05, 2021, 11:55 AM ISTUpdated : Dec 05, 2021, 12:03 PM IST
Anasuya: అనసూయ ఇంటిలో తీవ్రవిషాదం... తండ్రి అకాల మరణం!

సారాంశం

యాంకర్ అనసూయ ఇంటిలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి అకాల మరణం పొందారు. దీంతో అనసూయ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

చిత్ర పరిశ్రమలో విషాదాలు కొనసాగుతున్నాయి. పరిశ్రమకు సంబంధించిన నటులు, ప్రముఖులు కన్నుమూస్తున్నారు. రోజుల వ్యవధిలో కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్, లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణం పొందారు. 


కాగా నేడు యాంకర్ , నటి అనసూయ (Anchor Anasuya)తండ్రి మధుసూదనరావు లోకాన్ని విడిచి పోయారు. 63 ఏళ్ల మందుసూధనరావు మరణానికి అనారోగ్యమే కారణమని తెలుస్తోంది. కొన్నాళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన నేడు తుది శ్వాస విడిచారు. మధుసూదనరావు గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర వహించినట్లు సమాచారం. 


అనసూయ తండ్రి మరణవార్త తెలిసిన సన్నిహితులు, మిత్రులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అనసూయ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు. తార్నాకలో ఈ సంఘటన చోటు చేసుకోగా... అనసూయ తన షెడ్యూల్స్ క్యాన్సిల్ చేసుకొని తార్నక వెళ్లారని సమాచారం. 

Also read సినీ పరిశ్రమలో మరో విషాదం.. దిగ్గజ నటుడు శివరామ్ మృతి

కాగా అనసూయ-భరద్వాజ్ ల ప్రేమను మధుసూధనరావు తీవ్రంగా వ్యతిరేకించారట. ఐదేళ్లకు పైగా అనసూయ ఎదురు చూసి తండ్రి అనుమతి తర్వాత భరద్వాజ్ ని వివాహం చేసుకున్నారట. ఈ విషయాన్ని అనసూయ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నటిగా, యాంకర్ గా ఫుల్ బిజీగా ఉన్న అనసూయ ఈ ఘటనతో కృంగిపోయారని తెలుస్తుంది, పనులన్నీ పక్కనపెట్టి తండ్రి సందర్శనార్ధం బయలుదేరారట. 


 

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్