పుష్ప టీజర్ : 'తగ్గేదేలే' ఊరమాస్ పుష్పరాజ్ గా బన్నీ కేక

Published : Apr 07, 2021, 08:40 PM ISTUpdated : Apr 07, 2021, 11:07 PM IST
పుష్ప టీజర్ : 'తగ్గేదేలే' ఊరమాస్ పుష్పరాజ్ గా బన్నీ కేక

సారాంశం

దర్శకుడు సుకుమార్ ఫ్యాన్స్ అంచనాలకు తగ్గకుండా, ఇంకా ఊహకు మించి పుష్ప తెరకెక్కిస్తున్నారని అర్థం అవుతుంది. కారడవుల్లో ఎర్ర చందనం దొంగగా అల్లు అర్జున్ ఓ ఊర మాస్ గా ఉన్నాడు.

అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న గిఫ్ట్ వచ్చేసింది. పుష్ప ఫస్ట్ లుక్ టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేశారు. నిమిషానికి పైగా ఉన్న పుష్ప ఫస్ట్ లుక్ టీజర్ దుమ్మురేపింది. దర్శకుడు సుకుమార్ ఫ్యాన్స్ అంచనాలకు తగ్గకుండా, ఇంకా ఊహకు మించి పుష్ప తెరకెక్కిస్తున్నారని అర్థం అవుతుంది. కారడవుల్లో ఎర్ర చందనం దొంగగా అల్లు అర్జున్ ఓ ఊర మాస్ గా ఉన్నాడు. 


పాత్రకు తగ్గట్టుగా అల్లు అర్జున్ గెటప్, నటన అద్భుతం అని చెప్పాలి. దొంగగా పోలీసులతో పాటు, ప్రత్యర్థి ముఠాలతో పుష్ప రాజ్ పోరాటమే పుష్ప అని తెలుస్తుంది. పుష్ప టీజర్ లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. అలాగే హీరోయిన్ రష్మికను కూడా పరిచయం చేయడం విశేషం. అటవీ ప్రాంతానికి చెందిన పల్లెటూరి అమ్మాయిగా, లంగా ఓణిలో లో ఆమె లుక్ ఆకట్టుకుంది. 
దేవిశ్రీ బీజీఎమ్ సైతం టీజర్ కి హైలెట్ గా నిలిచింది. 

పుష్ప మూవీతో అల్లు అర్జున్ మరో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ పుష్ప కాగా, టీజర్ తో అంచనాలు మరో స్థాయికి తీసుకెళ్లింది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫాజిల్ ఫహద్ విలన్ రోల్ చేయడం విశేషం. 

PREV
click me!

Recommended Stories

Mysaa Glimpse Review: అడవిలో గర్జించిన రష్మిక మందన్న.. `మైసా` మూవీ ఫస్ట్ గ్లింప్స్ జస్ట్ గూస్‌ బమ్స్
కాంతార 1 రికార్డుకు గండి కొట్టిన ధూరందర్.. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ?