బన్నీ ఫ్యాన్స్ ని ఉసూరుమనిపించిన పుష్ప మేకర్స్... సోషల్ మీడియాలో తిట్ల దండకం!

Published : Apr 07, 2021, 07:50 PM IST
బన్నీ ఫ్యాన్స్ ని ఉసూరుమనిపించిన పుష్ప మేకర్స్... సోషల్ మీడియాలో తిట్ల దండకం!

సారాంశం

నేడు సాయంత్రం 6:12 నిమిషాలకు పుష్ప టీజర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇక పుష్ప ఫస్ట్ లుక్ టీజర్  కోసం ఫ్యాన్స్ థియేటర్స్ కి కూడా వెళ్లడం జరిగింది.   

అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉత్సాహాన్ని ఆవిరి చేశారు పుష్ప నిర్మాతలు. దీనితో వాళ్ళు కోపంతో ఊగిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా తిట్ల పురాణం అందుకున్నారు. రేపు బన్నీ బర్త్ డే నేపథ్యంలో పుష్ప మూవీ నుండి ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నేడు సాయంత్రం 6:12 నిమిషాలకు పుష్ప టీజర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇక పుష్ప ఫస్ట్ లుక్ టీజర్  కోసం ఫ్యాన్స్ థియేటర్స్ కి కూడా వెళ్లడం జరిగింది. 


అనూహ్యంగా ఫస్ట్ లుక్ టీజర్ ని రెండు గంటలు పోస్ట్ ఫోన్ చేశారు నిర్మాతలు. టీజర్ 8:19 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు కొత్త ప్రకటన చేశారు. సెలబ్రేషన్స్ కి అన్నీ సిద్ధం చేసుకొని వేచి చూస్తున్న ఫ్యాన్స్, వాయిదా విషయం తెలుసుకొని తీవ్ర అసహనానికి గురయ్యారు. దర్శక నిర్మాతలపై తిట్ల పురాణం అందుకున్నారు. మీమ్స్, ట్రోల్స్ చేస్తూ తమ కోపాన్ని తీర్చుకున్నారు. మొత్తంగా ఆశగా టీజర్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ని నిరాశపరిచాడు.

 ఇక పుష్ప అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక నటిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పుష్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Mysaa Glimpse Review: అడవిలో గర్జించిన రష్మిక మందన్న.. `మైసా` మూవీ ఫస్ట్ గ్లింప్స్ జస్ట్ గూస్‌ బమ్స్
కాంతార 1 రికార్డుకు గండి కొట్టిన ధూరందర్.. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ?