Allu Arjun: ‘పుష్ప’ ఈవెంట్ సైతం దుబాయిలోనే, డిటేల్స్..

Surya Prakash   | Asianet News
Published : Nov 10, 2021, 03:29 PM ISTUpdated : Nov 10, 2021, 03:32 PM IST
Allu Arjun:  ‘పుష్ప’ ఈవెంట్ సైతం దుబాయిలోనే, డిటేల్స్..

సారాంశం

ఈ చిత్రం నుండి విడుదల అయిన టీజర్, విడియోలు, పాటలు ఇప్పటికే ప్రేక్షకులను, ఫ్యాన్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.  ఈ నేపధ్యంలో సినిమాకు సంభందించిన ఈవెంట్స్ రకరకాల ప్లేస్ లలో ప్లాన్ చేసారు. వాటితో సినిమాకు హైప్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.  

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప(Pushpa). ఈ చిత్రం లో రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు మేకర్స్.  ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 17 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. దాంతో చిత్రం ప్రమోషన్ యాక్టివిటీస్ పెంచేశారు.  

ఈ చిత్రం నుండి విడుదల అయిన టీజర్, వీడియోలు, పాటలు ఇప్పటికే ప్రేక్షకులను, ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.  ఈ నేపధ్యంలో సినిమాకు సంబంధించిన ఈవెంట్స్ రకరకాల ప్లేస్ లలో ప్లాన్ చేసారు. వాటితో సినిమాకు హైప్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.  ఈ క్రమంలోనే దుబాయిలో నవంబర్ ఫస్ట్ వీక్ లో ఓ భారీ ఈవెంట్ ని జరపనున్నారు. హిందీలోనూ ఈ సినిమాని రిలీజ్ చేస్తుండటంతో మరో భారీ చిత్రం `ఆర్ ఆర్ ఆర్` దారిలోనే వెళ్లి దుబాయిలో ఈవెంట్ చేస్తున్నారు.

అలాగే సినిమా ప్రారంభించినప్పటిన ఉండి మొన్నటి వరకు సినిమాను పాన్ ఇండియా లెవల్‌ లో మొత్తం అయిదు భాషల్లో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటిస్తూ వచ్చారు. కాని ఇటీవల హిందీ వర్షన్‌ ను స్కిప్‌ చేస్తున్నట్లుగా వార్తలు మొదలు అయ్యాయి.   హిందీని స్కిప్‌ చేసినట్లుగా యూనిట్‌ సభ్యులు అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. అయితే హిందీకు ఇబ్బందులు తొలిగినట్లు సమాచారం. దాంతో హిందిలోనూ భారీగా రిలీజ్ చేయబోతున్నారు.

 దాంతో ఉత్తరాది అభిమానులతో పాటు ఇక్కడి ఫ్యాన్స్  కూడా `పుష్ప` ను ఆదిరిస్తారు. వీటి వల్ల రికార్డు బ్రేకింగ్ వసూళ్లు పుష్ప కు వస్తాయి అంటున్నారు. ఉత్తరాదిన బన్నీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వారు అంతా కూడా `పుష్ప` హిందీ వర్షన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. 

also read: లుక్: 'దాక్షాయని' పాత్ర వెనక దాగున్న నిజం ఇదీ
 
ఇదిలా ఉండగా ఈ చిత్రం నుండి విడుదలైన శ్రీవల్లి లిరికల్ వీడియో సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ పాట యూ ట్యూబ్ లో మరొక మైలు రాయి ను అధిగమించింది. ఈ పాట ఇప్పటి వరకూ 50 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఫాహద్ ఈ చిత్రం లో విలన్ పాత్ర లో నటిస్తుండగా, సునీల్, అనసూయ భరద్వాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

also read: Allu Arjun : అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పకపోతే, న్యాయపోరాటమే.. ఆర్టీసీఎండీ సజ్జనార్

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Barabar Premistha Collections: బరాబర్‌ ప్రేమిస్తా మూవీ బాక్సాఫీసు వసూళ్లు.. టీ ఖర్చులు కూడా రాలేదా?
OTT Thrillers: జియో హాట్‌స్టార్ లో అస్సలు మిస్ కాకూడని టాప్ 3 థ్రిల్లర్స్..బుర్రని హీటెక్కించే ట్విస్టులు