
టాలీవుడ్ లో అనసూయ క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ యాంకర్ గా యువతలో తిరుగులేని పాపులారిటీ సొంతం చేసుకుంది అనసూయ. అవకాశం చిక్కినప్పుడల్లా అనసూయ నటిగా తనదైన ముద్ర వేస్తోంది. సోషల్ మీడియాలో కుర్రాళ్ళని మైకంలో ముంచెత్తే ఫోటోషూట్స్ తో అనసూయ రెచ్చిపోతూ ఉంటుంది.
నటిగా ప్రస్తుతం మంచి అవకాశాలు అందుకుంటోంది Anasuya. ప్రస్తుతం అనసూయ Allu Arjun పుష్ప చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవల అనసూయ సోషల్ మీడియాలో అభిమానులతో ఆస్క్ మీ ఎనీథింగ్ చాట్ నిర్వహించింది. దీనితో అభిమానుల నుంచి అనసూయకు అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఓ అభిమాని అనసూయని ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. ఏదైనా పెద్ద చిత్రంలో మంచి అవకాశం వస్తే.. అవసరమైతే ఆ పాత్ర కోసం గుండు కొట్టించుకుంటారా అని ప్రశ్నించాడు. దీనికి అనసూయ పాజిటివ్ గా స్పందించింది. తప్పకుండా గుండు కొట్టించుకుంటాను. పాత్రకు గుండు కొట్టించుకోవడం అవసరం అయితే అలాగే చేస్తాను అని బదులిచ్చింది. దీనితో నటిగా అనసూయ డెడికేషన్ అది అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: యంగ్ హీరోయిన్ జీవితం నిలబెట్టిన సమంత.. ఆమె కన్నీటి కష్టాలు వింటే, షాకింగ్ డీటెయిల్స్
అనసూయ సినిమాల ఎంపిక విషయంలో సెలెక్టివ్ గా వ్యవహరిస్తోంది. బలమైన పాత్రలో నటించే ఛాన్స్ వస్తేనే అంగీకరిస్తోంది. ప్రస్తుతం అనసూయ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో అనసూయ పాత్ర పేరు 'దాక్షాయణి'. ఆమె ఫస్ట్ లుక్ ని నేడు రిలీజ్ చేశారు. అనసూయ రస్టిక్ లుక్ ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా ఉంది. పెద్ద బొట్టు, చీరకట్టు లో అనసూయ పెల్లెటూరి మహిళగా మాస్ టచ్ తో కనిపిస్తోంది.
Also Read: రత్తాలు కిరాక్ హాట్ షో.. క్లీవేజ్ అందాలతో కేక పెట్టిస్తున్న రాయ్ లక్ష్మి
ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్నారు. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. Pushpa మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.