చైనీస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో వర్మ సినిమా

By Surya PrakashFirst Published Nov 10, 2021, 11:01 AM IST
Highlights

 ఈ సినిమాని FOSHAN KUNG FU FILM FESTIVAL లో నవంబర్ 27న ప్రీమియర్ చేస్తున్నారు. బ్రూస్ లీ 81 వ పుట్టిన రోజు ఏనవర్శరీ సందర్బంగా ఆయన నేటివ్ ప్లేస్ అయిన చైనాలోని FOSHAN  లో ఈ సెలబ్రేషన్స్ చోటు చేసుకోనున్నాయి. 
 

రామ్ గోపాల్ వర్మ...హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేస్తూనే ఉంటాడు. అయితే ఆయన సినిమాలు ఫెస్టివల్స్ కు వెళ్లటం అరుదు. కానీ ఇప్పుడు ఈయన నుంచి వచ్చిన సినిమా  చైనీస్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైంది. ఇండియాలోనే ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ సినిమా అంటూ ‘లడికి’ అనే సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు రామ్ గోపాల్ వ‌ర్మ. పైగా ఈయన కెరీర్‌లోనే హైయ్యస్ట్ బడ్జెట్ సినిమా ఇదే అంటూ ప్రచారం చేస్తున్నారు మేకర్స్. ల‌డ్‌కీ: ఎంట‌ర్ ది గ‌ర్ల్ డ్రాగ‌న్ (Ladki Enter The Girl Dragon) పేరుతో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాని FOSHAN KUNG FU FILM FESTIVAL లో నవంబర్ 27న ప్రీమియర్ చేస్తున్నారు. బ్రూస్ లీ 81 వ పుట్టిన రోజు ఏనవర్శరీ సందర్బంగా ఆయన నేటివ్ ప్లేస్ అయిన చైనాలోని FOSHAN  లో ఈ సెలబ్రేషన్స్ చోటు చేసుకోనున్నాయి. 

ఇక మాఫియా కథలను డీల్ చేయడంలో రామ్ గోపాల్ వర్మది అందెవేసిన చేయి. ఇండియన్ సినిమాపై ఆయనది ఓ సపరేట్ స్టయిల్ . అలాగే, అమ్మాయిలను గ్లామ‌ర‌స్‌గా చూపించడంలో కూడా తనదైన యాంగిల్స్ తో దుమ్మురేపుతారు. కెమెరా యాంగిల్స్ నుంచి టేకింగ్, మేకింగ్ వరకూ వర్మ అమ్మాయిలను చూపించే విధానంపై  ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోరు. తనదైన స్టైల్ లో సినిమాలు తీస్తుంటారు. 'లడకీ' ట్రైలర్ చూస్తే అలాగే అనిపిస్తుంది. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇది. హిందీలో ట్రైలర్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.  చైనాలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న 'ఎంటర్ ద గర్ల్ డ్రాగన్' సినిమాకు హిందీ వెర్షన్ ఇది. 

బ్రూస్ లీ‌కి వీరాభిమాని అయిన ఒక అమ్మాయి కథను ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ పేరుతో తెరపై ఆవిష్కరించారు. పూజా బాలేకర్ ఈ సినిమా ద్వారా పరిచయమవుతోంది.  ఇండో - చైనీస్ కోప్రొడక్షన్ లో సినిమా రూపొందింది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న ఓ అమ్మాయి ఏం చేసింది? ఏంటి? అనేది కథగా తెలుస్తోంది.   పూజా భలేకర్ గ్లామర్ షో హైలైట్ , వర్మ మార్క్ టేకింగ్ తో సినిమా సాగనుంది. హీరోయిన్ చేత బికినీ వేయించి ఫైట్స్ చేయించటంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఆర్ట్ సి మీడియా, చైనా కంపెనీ బిగ్ పీపుల్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది. మార్షల్ ఆర్ట్స్ రారాజు బ్రూస్ లీ నటించిన 'ఎంటర్ ది డ్రాగన్' చిత్రానికి ఈ 'లడకి' నివాళి అని చిత్రబృందం చెబుతోంది. 

click me!