Lakshmi Manchu: ప్రమాదానికి గురైన మంచు లక్ష్మీ.. శరీరంపై గాయాలు, ఏం జరిగిందంటే?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 20, 2021, 12:28 PM IST
Lakshmi Manchu: ప్రమాదానికి గురైన మంచు లక్ష్మీ.. శరీరంపై గాయాలు, ఏం జరిగిందంటే?

సారాంశం

మోహన్ బాబు కుమార్తె నటి మంచు లక్ష్మీ ప్రమాదానికి గురైనట్లు న్యూస్ వైరల్ అవుతోంది. మంచు లక్ష్మీ చేతులు కాళ్ళపై గాయాలు ఉన్న ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్వయంగా మంచు లక్ష్మీ ఈ ఫొటోస్ ని షేర్ చేసింది.

మోహన్ బాబు కుమార్తె నటి మంచు లక్ష్మీ ప్రమాదానికి గురైనట్లు న్యూస్ వైరల్ అవుతోంది. మంచు లక్ష్మీ చేతులు కాళ్ళపై గాయాలు ఉన్న ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్వయంగా మంచు లక్ష్మీ ఈ ఫొటోస్ ని షేర్ చేసింది. దీనితో మంచు లక్ష్మీ ప్రమాదానికి గురైందని సోషల్ మీడియాలో పోస్ట్ లు ఎక్కువయ్యాయి. చాలా మంది ఆందోళనకు గురవుతూ ఆమెకు ఏమైంది అంటూ ఆరా తీశారు. 

అయితే మంచు లక్ష్మీకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆమె క్షేమంగా ఉన్నారు. ఈ విషయాన్ని మంచు లక్ష్మీ స్వయంగా ప్రకటించారు. ఇక గాయాలతో ఉన్న ఆ ఫోటోస్ అంటారా.. అవి ఓ చిత్రానికి సంబందించిన స్టిల్స్ అట. 'ఒకే ఒకే నాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అవి సినిమాకు సంబందించి స్టిల్స్ మాత్రమే. గాయాలు కాదు' అని మంచు లక్ష్మి మరో పోస్ట్ పెట్టింది. 

మంచు లక్ష్మీ ప్రస్తుతం మలయాళంలో మోహన్ లాల్ నటిస్తున్న చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. ఆ చిత్రంలో పోరాట సన్నివేశంలో భాగంగా ఆమెకు గాయాలైనట్లు మేకప్ వేశారు. ఆ ఫొటోస్ ని మంచు లక్ష్మి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆమెకు నిజంగానే ప్రమాదం జరిగిందని అభిమానులు భయపడ్డారు. 

Also Read: పులి కసిగా పరిగెడితే ఎలా ఉంటుందో తెలుసా.. చరణ్, ఎన్టీఆర్ మధ్య తేడా అదే, అంచనాలు పెంచేసిన జక్కన్న

మంచు లక్ష్మి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ పిక్స్ ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి అనేక వీడియోలు కూడా చేస్తోంది. ఎప్పుడూ అందమైన ఫోటోలు షేర్ చేసే మంచు లక్ష్మి గాయాలతో ఉన్న ఫోటోస్ షేర్ చేయడంతో ఫ్యాన్స్ కంగారు పడ్డారు. 

Also Read: షాకింగ్ న్యూస్... హీరోయిన్ హంసా నందికి బ్రెస్ట్ క్యాన్సర్..!

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు