
ఓ టైమ్ లో పూరి జగన్నాథ్ తో సినిమా చేయాలని అందరూ హీరోలకు ఉండేది. ఆ క్రమంలోనే మహేష్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలకు ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ అందించాడు. అయితే.. ఒక్క లైగర్ మూవీ డిజాస్టర్ అవ్వడంతో అంతా తిరగబడింది. అప్పటికే సెట్స్ పై ఉన్న జనగణమన చిత్రం కూడా ఆగిపోయింది. ఆతర్వాత పూరి.. చిరంజీవితో సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి కానీ..అవీ వర్కవుట్ కాలేదు. ఈక్రమంలో బాలకృష్ణతో ఓకే అయ్యిందని ప్రచారం జరిగింది కానీ.. కుదరలేదు. అబ్బబ్బే ఇవేమీ కాదు... రామ్ తో ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ ప్లాన్ అన్నారు. అదీ ముందుకు వెళ్ళలేదు. అయితే పూరి మొత్తానికి యంగ్ హీరోతో సినిమా ఓకే అయ్యిందని సమాచారం. ఇంతకీ ఎవరా హీరో ...
ఆ హీరో మరెవరో కాదు విశ్వక్సేన్ అని తెలుస్తోంది. పూరి జగన్నాథ్ రాసే కథలకు , క్యారక్టరైజేషన్ కు విశ్వక్ సేన్ బాడీ లాంగ్వేజ్ ఫెరఫెక్ట్ గా సెట్ అవుతుందని ఈ డెసిషన్ తీసుకున్నాడంటున్నారు. పూరి హీరో గా విశ్వక్ సేన్ ఫెరఫెక్ట్ అంటన్నారు. అందుచేత ఈ కాంబోకి క్రేజ్ వచ్చేసినట్టే. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఆగష్టు నుంచి సెట్స్ పైకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంకా మూడు నెలల టైమ్ ఉంది. ఈలోగా పూరి స్రిప్టు వర్క్ ఫినిష్ చేస్తారు. ఈ లోగా విశ్వక్ తను ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తాడు.
‘మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు విశ్వక్. ‘విశ్వక్‌సేన్ ‘దాస్ కా ధమ్కీ’ ఆహా ఓటీటీలో మంచి ఆదరణ పొందుతున్నది.ఆయన గత సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ కూడా ఆహా టాప్ త్రీలో ఉంది. ‘ఓరి దేవుడా’ కూడా విజయవంతమైంది. విశ్వక్‌సేన్‌తో ఆహా ఓటీటీ ఓ సరికొత్త ప్లాన్ చేస్తున్నది. దాని గురించి త్వరలో ప్రకటన చేస్తారు. మరోవైపు పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమాలో చేయటానికి సిద్దు జొన్నలగడ్డ, నాగ చైతన్య, అఖిల్ వంటి యువ హీరోలు ఆసక్తి చూపెడుతున్నట్లు సమాచారం.