నన్ను ట్రోల్ చేస్తున్నారు...చర్యలు తీసుకోండి, కోర్టులో ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాధ్య కేసు..

Published : Apr 20, 2023, 11:44 AM ISTUpdated : Apr 20, 2023, 11:46 AM IST
నన్ను ట్రోల్ చేస్తున్నారు...చర్యలు తీసుకోండి, కోర్టులో ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాధ్య కేసు..

సారాంశం

బిగ్‌బీ అమితాబ్ మనవరాలు, ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్ ల గారాల కూతురు ఆరాధ్య బచ్చన్  ఓ యూట్యూబ్‌ టాబ్లాయిడ్‌పై ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. తనకు అన్యాయం జరుగుతోందని.. తనను కాపాడాలంటూ ఆమె కోర్లుకు విన్నవించుకుంది. ఇంతకీ అసలే విషయం ఏంటీ అంటే..? 

ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్ ల గారాల కూతురు ఆరాధ్య బచ్చన్  ఓ యూట్యూబ్‌ టాబ్లాయిడ్‌పై ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. తనపై అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారని. నిరాధారమైన వార్తలు వ్యాప్తి చేస్తూ.. తన ప్రైవసీకీ భంగం కలిగిస్తున్నారంటూ.. ఇలా చేస్తున్న సదరు యూట్యూబ్  టాబ్లాయిడ్‌ను నిలువరించాలంటూ కోర్టును వేడుకుంది ఐశ్వర్యా రాయ్ కూతురు ఆరాధ్య.  ఈ కేసులో కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. 

తన ఆరోగ్యంపై .. వ్యక్తిగత జీవితంపై.. ఉన్నవి లేనివి కల్పించుకుని.. ఓ  యూట్యూబ్ టాబ్లాయిడ్ తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని ఆరాధ్య తన పిటిషన్‌లో ఆరోపించింది. తాను మైనర్ కాబట్టి.. నా హక్కులకు భంగం కలగుండా..  ఇలాంటి వార్తల వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని కోర్టును అభ్యర్థించింది చిన్నారి. దాంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అమితాబ్ ఫ్యామిలీపై ఇలాంటి ట్రోల్స్ ఇప్పుడు కాదు... ఎప్పటి నుంచో ఉన్నాయి.  

గతంలోనూ ఆరాధ్య పై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో  చక్కర్లు కొట్టాయి. అంతే కాదు రీసెంట్ గా ఐశ్వర్య రాయ్ కాపురంపై కూడా సోషల్ మీడియాలో విష ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఆరాధ్య  సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురైంది. తన వ్యక్తిగత జీవితమే లక్ష్యంగా ఆమెపై ట్రోల్స్ అవాకులు చవాకులు రాసుకొచ్చారు. ఇక ఈ ట్రోల్స్ పై ఓ దశలో  అభిషేక్ బచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రోలింగ్ అస్సలు ఎంత మాత్రం ఒప్పుకొదగ్గ విషయం కాదు...  ఎవరూ దాన్ని సహించకూడదు. అయితే.. ఓ పబ్లిక్ ఫిగర్‌గా ట్రోలింగ్ ఎందుకు జరుగుతోందో నేను అర్థం చేసుకోగలను. కానీ.. నా కూతురిపై ట్రోలింగ్ ఏ రకంగానూ సమర్థనీయం కాదు. ఏదైనా అనాలనుకుంటే నన్నే డైరెక్ట్‌గా అనండి అంటూ అభిషేక్ తీవ్రస్థాయిలో 
విరుచుకుపడ్డారు.

ఇక రీసెంట్ గా ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్ విడిపోయి .. త్వరలో విడాకులు తీసుకోబోతున్నారు అంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అందుకే ఐశ్వర్య రాయ్ ఒక్కరే తన కూతురుతో కలిసి అన్ని వేడుకలకు వస్తున్నారు. అభిషేక్ తనతో కలిసి రాకపోవడానికి కారణం వాళ్ళు విడిపోతున్నారు.. వాళ్లిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అంటూ.. వార్తలు వైరల్ అయ్యాయి. దానిపై కూడా అభిషేక్ ఇండైరెక్ట్ గా స్పందించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

'రౌడీ జనార్ధన' గ్లింప్స్ రివ్యూ.. కింగ్డమ్ లా గురి తప్పేలా లేదు, విజయ్ దేవరకొండ బీభత్సం చూశారా
'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రివ్యూ..రవితేజ, శర్వానంద్ ఇద్దరిలో ఎవరో ఒకరికి డ్యామేజ్ తప్పదా ?