కమ్ బ్యాక్ అదిరింది.. మేనల్లుడిపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు, విరూపాక్ష మూవీపై ట్వీట్

Published : Apr 21, 2023, 07:30 PM ISTUpdated : Apr 21, 2023, 07:32 PM IST
కమ్ బ్యాక్ అదిరింది.. మేనల్లుడిపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు, విరూపాక్ష మూవీపై ట్వీట్

సారాంశం

మెగా మేనల్లుడిపై ప్రశంసల వర్షం కురిపించాడు చిరంజీవి. అల్లుడు అదరగొట్టావ్ అంటూ..సాయి ధరమ్ తేజ్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు మెగాస్టార్. ట్వీట్టర్ లో ఏ ఫోటో పోస్ట్ చేశారంటే..? 


టాలీవుడ్‌  యంగ్ హీరో సాయిధరమ్‌ తేజ్‌  హీరోగా  నటించిన మిస్టరీ థ్రిల్లర్‌ మూవీ విరూపాక్ష. సాయి తేజ్ చాలా గ్యాప్ తరువాత.. వరుస ప్లాప్ ల తరువాత.. విరూపాక్ష సినిమాతో.. నేడు థియేటర్లలో సందడి చేశాడు. సుకుమార్ శిష్యుడు.. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈసినిమా .. రిలీజ్ అవ్వడంతోనే పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. దంతో మూవీ టీమ్ దిల్ ఖుష్ అవుతున్నారు. అంతే కాదు.. డైరెక్టర్ కార్తీక్ దండును హగ్ చేసుకుని మరీ.. సాయి తేజ్ ఎమోషనల్ అయ్యాడు. ఇక ఈక్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా సాయి తేజ్ కు స్పెషల్ విషెష్ చెప్పాడు. 

మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేస్తూ.. సాయి తేజ్ కు చిరు  సతీమణి సురేఖ కేక్‌ తినిపిస్తున్న  ఇమేజ్ ను ట్వీట్టర్ లో పోస్ట్ చేశారు. అంతే కాదు ఈ స్టిల్‌ ను పోస్ట్ చేస్తూ.. ఓ నోట్ రాశారు. విరూపాక్ష సినిమాపై వస్తున్న రిపోర్ట్స్‌ అద్బుతంగా ఉన్నాయి. ప్రియమైన సాయిధరమ్‌ తేజ్‌ విరూపాక్షతో గ్రాండ్‌ కమ్‌ బ్యాక్ ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు నీ సినిమాను ప్రశంసిస్తుండటం, సినిమాకు వారి ఆశీస్సులు అందించడం సంతోషంగా ఉంది. విరూపాక్ష టీంకు నా హృదయపూర్వక అభినందనలు అని ట్వీట్ చేశాడు చిరంజీవి.  

 

 

ఇక చిరంజీవి ట్వీట్ కు  ధన్యవాదాలు తెలిపారు సాయి తేజ్. థ్యాంక్స్  అత్తా మామ అంటూ రీట్వీట్ చేశాడు సాయిధరమ్‌ తేజ్‌. ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.  ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. సాయి ధరమ్ తేజ్.. యాక్సిడెంట్ తరువాత చాలా కాలం ఇబ్బంది పడ్డాడు. ఆరోగ్యం కుదుటపడటానికి చాలా కాలం పట్టింది. మాట పడిపోయి.. మళ్ళీ రావడానికి చాలా ఇబ్బంది పడ్డానని గతంలో సాయి తేజ్ ఇంటర్వ్యూలో వెల్లడిస్తూ.. ఎమోషనల్ అయ్యాడు. సుకుమార్ కూడా ఈ మూవీ ప్రీ రిలీజ్ లో ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. 

తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన విరూపాక్ష మిస్టరీ, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సాగుతూ మంచి టాక్‌ తెచ్చుకుంటోంది. ఇప్పటికే డైరెక్టర్‌ కార్తీక్ దండు, సాయిధరమ్‌ తేజ్‌ ఒకరినొకరు హగ్‌ చేసుకున్న వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. విరూపాక్ష చిత్రానికి కాంతార ఫేం అంజనీశ్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అజ‌య్‌, సునీల్ సాయిచంద్‌, రాజీవ్ కనకాల విరూపాక్షలో కీలక పాత్రల్లో నటించారు. భీమ్లానాయక్‌ ఫేం సంయుక్తా మీన‌న్ హీరోయిన్ గా నటించింది. 

PREV
click me!

Recommended Stories

Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..
500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా