పొన్నియిన్ సెల్వన్ 2 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ , టైమ్ ఫిక్స్. ఎప్పుడు.. ఎక్కడంటే..?

Published : Apr 21, 2023, 08:35 PM ISTUpdated : Apr 21, 2023, 08:38 PM IST
పొన్నియిన్ సెల్వన్ 2 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్  డేట్ , టైమ్  ఫిక్స్. ఎప్పుడు.. ఎక్కడంటే..?

సారాంశం

తమిళ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2.   ఇప్పటికే రిలీజ్ అయిన పార్ట్ 1 మూవీ.. ఇతర భాషల్లో  అంచనాలు రీచ్ అవ్వకపోయినా.. తమిళ ప్రేక్షకులను మాత్రం అలరించింది. ఇక పార్ట్ 2 మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడటంతో.. తెలుగు ప్రీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు టీమ్. 

సౌత్ స్టార్ సీనియర్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్. మణిరత్నం అభిమానులంతా 'పొన్నియిన్ సెల్వన్ 2' సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అక్రమంలోనే  పొన్నియర్ సెల్వన్ పార్ట్ 2 మూవీ.. ప్రపంచవ్యాప్తంగా .. ఈ నెల 28న వివిధ భాషల్లో రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్ తో.. తమిళుల చరిత్ర ఆధారంగా తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్.. తమిళనాట ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసింది. 

ఇక పొన్నియన్ సెల్వన్ తెలుగు వర్షన్ మూవీపై పెద్దగా అంచనాలులేవు.. కాని ప్రమోషన్స్ ద్వారా తెలుగులో కూడా రిజల్ట్ రాబట్టాలని చూస్తున్నారు. ఇక  ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు వెర్షన్ కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదులో ప్లాన్ చేశారు. ఈ నెల 23వ తేదీన నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ మొదలుకానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు మూవీ టీమ్. ఇక ఈసినిమాకు సబంధించిన  భారీ తారాగణమంతా ఈవెంటుకు హాజరుకానుంది. అయితే ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధి ఎవరు అనేది మాత్రం వెల్లడించలేదు. 

పొన్నియన్ సెల్వన్2 పాన్ ఇండియా మూవీ అయినా.. ఈసినిమాపై పెద్దగా బజ్ లేదు. తమిళనాడులో తప్పించి.. ఇతర భాషల్లో పెద్దగా ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేయలేకపోయారు టీమ్. ఎందుకో ఏమో.. ప్రమోషన్స్ ను కూడా పెద్దగా చేయడంలేదు టీమ్. పాన్ ఇండియా మూవీకి ఉండాల్సిన మినిమమ్ సందడి ఈసినిమాకు లేదు. అయితే ఓన్లీ తమిళనాడుపైనే ఎక్కువ దృష్టి పెట్టారా అనే అనుమానం కూడా కలుగుతుంది. తమిళ చరిత్ర ఆధారంగా తీసిన సినిమా కావడంతో ఇతర భాషల్లో ఈసినిమాన పెద్దగా పట్టించుకోవడంలేదు. 

విక్రమ్,ఐశ్వర్య రాయ్, కార్తి , త్రిష ,జయం రవి , జయరామ్, శరత్ కుమార్ తో పాటు..  ప్రకాశ్ రాజ్ ప్రధానమైన పాత్రలలో కనిపించనున్న ఈసినిమాకు  ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించాడు. అసలు కథ పార్ట్ 2లోనే ఉంటుంది అని ప్రకటించడంతో.. ఒక వర్గం ప్రేక్షకులు ఈసినిమా కోసం ఆతృతగా  ఎదురుచూస్తున్నారు. మరి ఈమూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?
Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?