
డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ కు మనుషులంటే అస్సలు పడదు. ఇది స్వయంగా ఇటీవలే తనే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు పూరీ. గత కొంత కాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న పూరీ ఇమేజ్ హ్యాట్రిక్ ప్లాప్ తో మరింత డ్యామేజ్ అయింది. రోగ్ సినిమా ఫ్లాప్ తో పూరీ కెరీర్ గాడిలో పడుతుందని భావిస్తున్న బాలయ్య 101వ సినిమాపై కూడా అనుమానాలు పెరుగుతున్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ని హీరోగా లాంఛ్ చేసిన పూరి జగన్నాథ్ అంతకుముందు కన్నడలో పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌ని పరిచయం చేసాడు. దీంతో సి.ఆర్. మనోహర్ తన సోదరున్ని స్టార్ హీరోను చేయడానికి పూరి జగన్నాథ్ కావాలని పట్టుబట్టి 'రోగ్' చిత్రాన్ని పూరీతో తీసాడు. సోదరుడికి కోసం ఈ చిత్రంపై విపరీతంగా ఖర్చు పెట్టారు. పూరి ఒక్కడికే పది కోట్లు చెల్లించుకున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది.
ఇక తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ అయిన రోగ్ ఎక్కడా అనుకున్న స్థాయిలో ఆడట్లేదు. ఎంత ప్రచారం చేసినప్పటికీ టాక్ బాగా రాకపోయేసరికి రెండు భాషల్లోను రోగ్ ఫ్లాప్ అని డిక్లేర్ అయిపోయింది. రొటీన్‌గా సక్సెస్ మీట్లు నిర్వహిస్తున్నా.. థియేటర్లలో జనం లేక... నామమాత్రపు షేర్లు తెచ్చుకుంటోన్న ఈ చిత్రం పూరి కెరియర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ కావచ్చని అంటున్నారు.
రోగ్ చిత్రంపై నిర్మాత మనోహర్‌కి ముప్పై కోట్లయినా పోతాయట. తెలుగులో పూరి పేరు మీద కనీసం పదిహేను కోట్ల బిజినెస్ జరుగుతుందని ఆశిస్తే, కొనడానికి ఎవరూ రాకపోవడంతో నేరుగా రిలీజ్ చేసుకున్నారు. కన్నడలోనూ దాదాపుగా సొంతంగానే విడుదల చేయడం వల్ల ఈ నష్టాల్లో భాగం పంచుకోవడానికి కూడా ఎవరూ లేరు. మొత్తానికి పూరీ మనోహర్ కిచ్చిన జలక్ విలువ 30కోట్ల వరకు ఉంటుందన్నమాట.