గొడుగు అడ్డం పెట్టుకుని రహస్యంగా కారు ఎక్కిన Shah Rukh Khan.. అందుకోసమేనా..?

By team teluguFirst Published Nov 8, 2021, 5:26 PM IST
Highlights

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ (viral on social media) అవుతుంది. కలీనా ఎయిర్‌పోర్ట్ నుంచి ఎవరికి కనిపించకుండా అత్యంత రహస్యంగా తన కారులో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ (viral on social media) అవుతుంది. కలీనా ఎయిర్‌పోర్ట్ నుంచి ఎవరికి కనిపించకుండా అత్యంత రహస్యంగా తన కారులో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన ఆదివారం రోజు చోటుచేసుకుంది. షారుఖ్ ఖాన్ ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రైవేట్ విమానంలో ముంబై‌లోని ప్రైవేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. అక్కడ ఫొటోగ్రాఫర్లు వేచి ఉండటంతో..  వారి నుంచి తప్పించుకోవడానికి గొడుగు కింద దాక్కుని కారులోకి ఎక్కాడు. అక్కడే ఉన్న షారుఖ్ సిబ్బందిలో ఒకరు గొడుగు తీసుకురాగా.. దానిని అడ్డుపెట్టుకుని షారుఖ్ కారు వద్దకు చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినప్పటీ నుంచి ఆయన చాలా లోప్రొఫైల్ మెయింటెన్ చేస్తున్నాడు. అంతేకాకుండా మౌనమే పాటిస్తున్నాడు. ఆర్యన్ ఖాన్ ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న సమయంలో ఆయనను షారుఖ్ కలుసుకున్నారు. ఆ సమయంలో ఆయనను కెమెరాల్లో బంధించడానికి ఫొటోగ్రాఫర్లు పోటీపడ్డారు. ఈ క్రమంలోనే షారుఖ్ వారి కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు ఆదివారం ఈ విధానాన్ని అవలంభించినట్టుగా తెలుస్తోంది. 

Also read: Aryan Khan Released: జైలు నుంచి విడుదలైన ఆర్యన్ ఖాన్.. జైలుకు వద్దకు వచ్చిన షారుఖ్..భారీగా చేరుకున్న అభిమానులు

ముంబై నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్ షిప్‌లో రైడ్ చేసిన ఎన్సీబీ అధికారులు డ్రగ్స్‌ వినియోగించిన ఆరోపణలపై ఆర్యన్‌ ఖాన్‌తో పాటుగా మరికొందరిని అరెస్ట్ చేశారు. అక్టోబర్ 3వ తేదీన వీరి అరెస్ట్‌ను ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే ధ్రువీకరించారు.  దీంతో ఒక్కసారిగా షారుఖ్ అభిమానుల్లో, బాలీవుడ్‌లో కలకలం రేగింది. అయితే ఆర్యన్ ఖాన్ తరఫు లాయర్లు మాత్రం.. అతడు డ్రగ్స్ వినియోగించలేదని, అందుకు ఎలాంటి వాదనలు కోర్టులో వాదనలు వినిపించారు. తొలుత కోర్టు ఆర్యన్‌ ఖాన్‌కు అక్టోబర్ 7 వరకు కస్టడీ విధించింది. ఆ తర్వాత మరో 14 రోజుల పాటు కస్టడీకి ఆదేశించింది. దీంతో అక్టోబర్ 8న ఆర్యన్ ఖాన్ ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలుకు తరలించారు. ఇక, ఆర్యన్ తరఫున దాఖలైన బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.

Also read: క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్: ఆర్యన్ అరెస్ట్ పెద్ద కుట్ర.. ముంబై పోలీసులకు అజ్ఞాత వ్యక్తి సమాచారం

 

అక్టోబర్ 26న బాంబే హైకోర్టులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఆర్యన్ తరఫున సీనియర్ లాయర్లు ముకుల్ రోహత్గీ, సతీశ్ మానెశిందే వాదనలు వినిపించారు. మరుసటి రోజు కూడా కోర్టులో వాదనలు జరిగాయి. ఆ తర్వాత ఎన్సీబీ తరఫు న్యాయవాదులు కూడా కోర్టుకు వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే బాంబే కోర్టు ఆర్యన్ ఖాన్‌తో సహా నిందితులుగా మరో ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో షారుఖ్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. అయితే ఆర్యన్ ఖాన్ బెయిల్ ప్రక్రియ పూర్తి చేయడంలో బాలీవుడ్ నటి జూహీ చావ్లా కీలక భూమిక పోషించారు. ఆర్యన్‌కు బెయిల్‌ కోసం ఆమె పూచీకత్తు ఇచ్చారు. చివరకు అక్టోబర్ 30వ తేదీన ఆర్యన్ బెయిల్‌పై విడుదలయ్యారు.
 

click me!