డేటింగ్ యాప్ లో లారా దత్తా.. దానికి నేను వ్యతిరేకం కాదు, అంతా అసత్యం అంటూ..

Published : Nov 08, 2021, 04:46 PM IST
డేటింగ్ యాప్ లో లారా దత్తా.. దానికి నేను వ్యతిరేకం కాదు, అంతా అసత్యం అంటూ..

సారాంశం

మాజీ విశ్వసుందరి లారా దత్తాపై ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లారా దత్తా డేటింగ్ యాప్ లో ప్రొఫైల్ ఓపెన్ చేసిందంటూ గత రెండు రోజులుగా ప్రచారాలు జోరందుకున్నాయి.

మాజీ విశ్వసుందరి లారా దత్తాపై ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లారా దత్తా డేటింగ్ యాప్ లో ప్రొఫైల్ ఓపెన్ చేసిందంటూ గత రెండు రోజులుగా ప్రచారాలు జోరందుకున్నాయి. దీనితో ఆమెపై మీమ్స్ కూడా క్రియేట్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. ఈ న్యూస్ వైరల్ గా మారుతుండడంతో క్లారిటీ ఇచ్చేందుకు స్వయంగా లారా దత్తా రంగంలోకి దిగింది. 

Lara Dutta ఇంస్టాగ్రామ్ లైవ్ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. రెండు రోజుల నుంచి నా గురించి కొన్ని మీమ్స్ సోషల్ మీడియాలో వరదలా ప్రవహిస్తున్నాయి. నాకు డేటింగ్ యాప్ లో ప్రొఫైల్ ఉన్నట్లు వైరల్ చేస్తున్నారు. దీనితో నాకు చాలా మెసేజ్ లు, కాల్స్ వస్తున్నాయి. ఒక్కొక్కరికి విడివిగా సమాధానం ఇవ్వలేక ఇలా ఇంస్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చాను. 

Also Read: ' నీ ఫిగర్ సైజెంత' అంటూ వల్గర్ గా ప్రవర్తించిన నెటిజన్.. దిశా పటాని కూల్ గా రిప్లై

గతంలో కానీ, ఇప్పుడు కానీ నాకు ఎలాంటి Dating App లో ప్రొఫైల్ లేదు. అలా అని నేను డేటింగ్ యాప్స్ కి వ్యతిరేకం కాదు. ఒకరినొకరు కలుసుకునేందుకు ఇది అద్భుతమైన మార్గం. కానీ నేను ఇప్పుడు ఎలాంటి డేటింగ్ యాప్ లో లేను. సో నా గురించి జరుగుతున్న ప్రచారం మొత్తం అవాస్తవం అని లారా దత్తా పేర్కొంది. 

Also Read: Akhanda Title Song: అబ్బురపరిచే విజువల్స్.. బాలయ్యని చూస్తూ, లిరిక్స్ వింటూ మరో కొత్త లోకంలోకి..

నా గురించి మీమ్స్ లో చూసి వెంటనే వెళ్లి డేటింగ్ యాప్స్ లో సెర్చ్ చేయకండి అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. ఇదిలా ఉండగా లారా దత్తా 2011లో టెన్నిస్ ఆటగాడు మహేష్ భూపతిని వివాహం చేసుకుంది. 2000లో లారా దత్తా మిస్ యూనివర్స్ పెజెంట్ లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2003లో సినిమాల్లోకి అడుగుపెట్టి అనేక బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. 

అప్పట్లో లారా దత్తా అందాలు  యువతని బాగా ఆకర్షించాయి. ఇటీవల సెలెబ్రిటీల ఫొటోలతో డేటింగ్ యాప్ లలో కొందరు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం గతంలో చాలా మంది సెలెబ్రెటీలకు ఇబ్బంది కలిగించింది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే