Puneeth Raj Kumar Death: నోట మాట రావడం లేదు... పునీత్ మరణంపై చిరంజీవి, పవన్ దిగ్భ్రాంతి

Siva Kodati |  
Published : Oct 29, 2021, 03:12 PM ISTUpdated : Oct 29, 2021, 03:16 PM IST
Puneeth Raj Kumar Death: నోట మాట రావడం లేదు... పునీత్ మరణంపై చిరంజీవి, పవన్ దిగ్భ్రాంతి

సారాంశం

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్‌ (puneeth raj kumar) మరణంపై తెలుగు సినీ నటుడు, జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు (kannada film industry)  తీరని లోటని పవన్ అభివర్ణించారు. 

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్‌ (puneeth raj kumar) మరణంపై తెలుగు సినీ నటుడు, జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు (kannada film industry)  తీరని లోటని పవన్ అభివర్ణించారు. అటు మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) సైతం పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం పట్ల షాక్‌కు గురయ్యారు. కన్నడ పరిశ్రమ ఒకస్టార్ హీరోను కోల్పోయిందని ఆయన అన్నారు. 

పునీత్ మరణం రాజ్ కుమార్ కుటుంబానికి తీరని లోటు. చిన్న వయసులోనే పునీత్ కు ఇలా జరగడం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చిరు అన్నారు. పునీత్ తనకు అత్యంత ఆప్తుడు, వారి కుటుంబంలోని వారంతా తనకు కావాల్సిన వారేనని మెగాస్టార్ వెల్లడించారు. ఎప్పుడు బెంగళూరు వెళ్ళినా తనను పునీత్ చాలా ఆప్యాయంగా పలకరిస్తారని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. పునీత్ మరణవార్త తెలియగానే తన నోట మాట కూడా రావడం లేదని చిరు ఆవేదన వ్యక్తం చేశారు .

 

 

అటు పునీత్ రాజ్‌కుమార్‌కి క్రికెట్ ప్రపంచంతో కూడా మంచి అనుబంధం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో (IPL) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (royal challengers bangalore) జట్టుకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణంపై క్రికెటర్లు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు...

పునీత్ రాజ్‌కుమార్ మరణంపై స్పందించిన భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ((virendra sehwag) .. ‘పునీత్ రాజ్‌కుమార్ ఇక లేరనే వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన అందరితో ఎంతో హుందాగా, వినయంగా ఉండేవారు. పునీత్ రాజ్‌కుమార్ మరణం ఇండియన్ సినిమాకి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. ఓం శాంతి’ అంటూ ట్వీట్ చేశారు... 

భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ (venkatesh prasad) కూడా పునీత్ రాజ్‌కుమార్‌కి నివాళి ఘటించారు. ‘పునీత్ రాజ్‌కుమార్ లేరనే విషయం తెలిసి షాక్‌కి గురయ్యాను. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా. ఆయన అభిమానులు సమన్వయంతో మెలుగులూ, పునీత్ రాజ్‌కుమార్ ఆత్మకు శాంతి చేకూర్చుతారని కోరుకుంటున్నా... ఓం శాంతి...’ అంటూ ట్వీట్ చేశాడు వెంకటేశ్ ప్రసాద్.

పునీత్ రాజ్‌కుమార్ మరణంపై క్రికెటర్లు అనిల్ కుంబ్లే (anil kumble), వేదా కృష్ణమూర్తి (veda krishnamurthy) కూడా స్పందించారు. ‘పునీత్ రాజ్‌కుమార్ లేరని తెలిసి షాక్‌కి గురయ్యా. సినీ ఇండస్ట్రీలో ఓ జెమ్‌ని కోల్పోయింది. నేను కలిసిన వారిలో ఎంతో మంచి మనిషి. చాలా వినయంగా ఉండే ఆయన ఇంత త్వరగా మనల్ని వెళ్లిపోవడం కలిచివేసింది. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, అసంఖ్యాక అభిమానులను నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే.

శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్‌ చేస్తోన్న సమయంలో పునీత్‌ ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. వెంటనే స్పందించిన కుటుంబసభ్యులు స్థానిక విక్రమ్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

55 ఏళ్ల వయసులో 300 సినిమాలు, 200 కోట్లకు పైగా ఆస్తి, స్టార్ డైరెక్టర్ ను పెళ్లాడిన హీరోయిన్ ఎవరు?
Boyapati Sreenu: చిరంజీవితో బోయపాటి సినిమా ఎందుకు చేయలేదో తెలుసా ? బాలకృష్ణ అఖండ వల్ల అంత జరిగిందా..