Puneeth rajkumar death: చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డు అందుకున్న పునీత్ రాజ్ కుమార్

By team teluguFirst Published Oct 29, 2021, 2:42 PM IST
Highlights

కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ నటవారసుడిగా పునీత్ రాజ్ కుమార్ వెండితెరకు పరిచయం అయ్యారు. రాజ్ కుమార్ మూడవ కుమారుడైన పునీత్ రాజ్ కుమార్, ఏమీ తెలియని పసిప్రాయంలోనే కెమెరా ముందుకు వచ్చాడు. 

కన్నడ సినీ లోకానికి నేడు చీకటి రోజు. ఎవరూ ఊహించని విధంగా పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించారు. నేడు ఉదయం వ్యాయామం చేస్తున్న Puneeth rajkumar death ఒక్కసారిగా కూలిపోవడం జరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరే సమయానికే ఆయన పరిస్థితి తీవ్ర విషమంగా ఉండడంతో, వైద్యులు ఎంతగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. 


కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ నటవారసుడిగా పునీత్ రాజ్ కుమార్ వెండితెరకు పరిచయం అయ్యారు. రాజ్ కుమార్ మూడవ కుమారుడైన పునీత్ రాజ్ కుమార్, ఏమీ తెలియని పసిప్రాయంలోనే కెమెరా ముందుకు వచ్చాడు. రాజ్ కుమార్, హారతి హీరో హీరోయిన్స్ గా నటించిన 'ప్రేమద కనికే' చిత్రంలో చంటిబిడ్డ గా కనిపించారు. డజనుకు పైగా చిత్రాల్లో రాజ్ కుమార్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. 


1985లో విడుదలైన 'బెట్టాడ హోవు' చిత్రంతో బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు పునీత్ రాజ్ కుమార్. షెర్లీ ఎల్ అరోరా రాసిన 'వాట్ దెన్, రామన్?' నవల ఆధారంగా తెరకెక్కిన Bettada hoovu చిత్రానికి ఎల్ ఎల్ లక్ష్మీ నారాయణ్ దర్శకత్వం వహించారు. రాము అనే ఓ పూర్ బాయ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. రాము పాత్రలో పునీత్ అద్భుత నటన కనబరిచారు. 

Also read Puneeth Rajkumar Death: కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ కన్నుమూత..
10ఏళ్ల ప్రాయంలో అప్పటి రాష్ట్రపతి గియాని జైల్ సింగ్ చేతుల మీదుగా పునీత్ రాజ్ కుమార్ National award అందుకున్నారు. ఇక పూర్తి స్థాయి హీరోగా పునీత్ అప్పు చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి పూరి జగన్నాద్ దర్శకుడు కాగా, ఇడియట్ చిత్రానికి రీమేక్.

click me!