మొన్న బండ్ల గణేష్.. ఇప్పుడు పృథ్వీనా?

Published : Jan 03, 2019, 05:29 PM IST
మొన్న బండ్ల గణేష్.. ఇప్పుడు పృథ్వీనా?

సారాంశం

సినీ ప్రముఖుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి.  ప్రస్తుతం ఆయన వైసిపి పార్టీ జెండా పట్టుకొని జగన్ కు మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు.

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో అందరిని ఎక్కువగా ఆకర్షించిన విషయం బండ్లగణేష్ డైలాగ్స్.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది గుర్తు పెట్టుకోండి.. లేకుంటే గొంతు కోసుకుంటా అని గణేష్ చెప్పిన విధానం.. ఆ తరువాత జరిగిన పరిణామాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. 

అయితే ఆ రెంజ్ లో కాకపోయినా ఇప్పుడు మరో సినీ ప్రముఖుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి.  ప్రస్తుతం ఆయన వైసిపి పార్టీ జెండా పట్టుకొని జగన్ కు మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జనసేనపై విమర్శలు చేస్తూ వైసిపి తప్పకుండా అధికారంలోకి రానుందని గట్టిగా చెబుతున్నారు. 

అయితే నెటిజన్స్ పృథ్వీ కామెంట్స్ కు కౌంటర్ లు ఇస్తూనే ఉన్నారు. బండ్ల గణేష్ తరువాత ఇప్పుడు పృథ్వీ వచ్చాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలంగాణాలో బండ్ల గణేష్ ఎగిరెగిరి ఒక్కసారిగా కిందపడినట్లే ఇప్పుడు ఏపీలో తమరికి కూడా జరగదనే గ్యారెంటీ ఏమిటని? ప్రశ్నిస్తూ.. అలోచించి మాట్లాడితే బెటర్ అని నెటిజన్స్ సలహాలు ఇస్తున్నారు. 

                                                     

PREV
click me!

Recommended Stories

మాజీ భార్య, గర్ల్ ఫ్రెండ్ తో కలిసి హృతిక్ రోషన్ బర్త్ డే సెలబ్రేషన్స్.. రిచ్ గా క్రూజ్ షిప్ లో పార్టీ
అఖండ 2 తర్వాత మరో సినిమా రిలీజ్ కి రెడీ.. క్రేజీ హీరోయిన్ గ్లామరస్ పిక్స్ వైరల్