రామ్ - పూరి: హైదరాబాద్ ఇస్మార్ట్ శంకర్

Published : Jan 03, 2019, 04:54 PM IST
రామ్ - పూరి: హైదరాబాద్ ఇస్మార్ట్ శంకర్

సారాంశం

ఎంతో కాలంగా ఉరిస్తోన్న రామ్ పోతినేని - పూరి జగన్నాథ్ కాంబినేషన్ ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్ళడానికి అంతా సిద్ధం చేసుకుంది. టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. పక్కా హైదరాబాది యాటిట్యూడ్ తో రామ్ సినిమాలో కనిపించనున్నాడు. ఇక టైటిల్ కూడా కూడా పూరి జగన్నాథ్ మార్క్ కి తగ్గట్టుగా ఉంది.

ఎంతో కాలంగా ఉరిస్తోన్న రామ్ పోతినేని - పూరి జగన్నాథ్ కాంబినేషన్ ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్ళడానికి అంతా సిద్ధం చేసుకుంది. టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. పక్కా హైదరాబాది యాటిట్యూడ్ తో రామ్ సినిమాలో కనిపించనున్నాడు. ఇక టైటిల్ కూడా కూడా పూరి జగన్నాథ్ మార్క్ కి తగ్గట్టుగా ఉంది. ఇస్మార్ట్ శంకర్ అని రామ్ చెప్పిన విధానం చూస్తుంటే పూరి తెలంగాణ మాస్ డోస్ గట్టిగా పెంచేసినట్లు అర్ధమవుతోంది. 

ముందుగా పండుగాడు అనే టైటిల్ సెట్ చేస్తున్నట్లు నిన్నటి వరకు రూమర్స్ బాగానే వచ్చాయి. ఇక ఫైనల్ గా ISMART శంకర్ అనే టైటిల్ ను పూరి రిలీజ్ చేశాడు. సాధారణంగా చాలా స్పీడ్ గా కథను ఫినిష్ చేసే పూరి జగన్నాథ్ ఈ ప్రాజెక్ట్ కోసం మాత్రం చాలా సమయం వెచ్చించాడు. రామ్ కూడా తనకు నచ్చే వరకు కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. 

పూరి గత కొంత కాలంగా వరుస అపజయాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రామ్ తో ఎంతవరకు మెప్పిస్తాడు అనేది ఆసక్తిని రేపుతోంది. సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి సమ్మర్ అనంతరం ప్రేక్షకుల్ ముందుకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.ఇంకా ఈ సినిమాకు మిగతా టెక్నీషియన్స్ ను అలాగే నటీనటులను సెలెక్ట్ చేయాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు
Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే