సంక్రాంతికి బన్నీ ప్లాన్!

Published : Jan 03, 2019, 04:52 PM IST
సంక్రాంతికి బన్నీ ప్లాన్!

సారాంశం

మెగాకుటుంబానికి వెస్ట్ గోదావరితో ఉన్న సంబంధం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లు రామలింగయ్య సొంతూరు పాలకొల్లు. మెగాస్టార్ చిరంజీవిది పుట్టింది ఆ పక్కనే ఉన్న మొగల్తూరులో.. 

మెగాకుటుంబానికి వెస్ట్ గోదావరితో ఉన్న సంబంధం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లు రామలింగయ్య సొంతూరు పాలకొల్లు. మెగాస్టార్ చిరంజీవిది పుట్టింది ఆ పక్కనే ఉన్న మొగల్తూరులో.. అందుకే మెగా ఫ్యామిలీ సభ్యులు అప్పుడప్పుడు పాలకొల్లు, మొగల్తూరుకి  వెళ్తొస్తుంటారు. 

అయితే ఈసారి అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో పాలకొల్లు వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి సంబరాలు అక్కడే చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. సాధారణంగా పండగల కోసం బన్నీ తన అత్తింటికి వెళ్తుంటాడు. కానీ ఈసారి తన సొంతూరుకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో సంక్రాంతి సీజన్ అంటే కోళ్ల పందేలు ఓ రేంజ్ లో జరుగుతుంటాయి. కుర్రాళ్ల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు అందరూ సంక్రాంతి అంటే గోదావరి జిల్లాల్లో వాలిపోతుంటారు.

మరి ఈసారి బన్నీ కూడా అక్కడే ఉన్నాడని తెలిస్తే వారి సంబరాలు మాములుగా ఉండవు కదా..! ఇక సినిమాల విషయానికొస్తే బన్నీ ఇటీవల త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. సంక్రాంతి తరువాత నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. 

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్