టాలీవుడ్ హీరో నాగ శౌర్య ప్రస్తుతం ‘రంగబలి’ చిత్ర ప్రమోషన్స్ లో ఉన్నారు. ఈ సందర్భంగా క్రేజీ హీరోయిన్ శ్రీలీలా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ సినిమాలోనే యంగ్ బ్యూటీకి ఛాన్స్ ఇవ్వాల్సిందంటూ చెప్పారు.
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. గతేడాది నవంబర్ లో పెళ్లి పీటలు ఎక్కిన యంగ్ హీరో ప్రస్తుతం సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. చివరిగా ‘వరుడు కావలెను’, ’ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి` (PAPA) చిత్రాలతో అలరించారు. లాస్ట్ మూవీ ‘పాపా’ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన నెక్ట్ సినిమాతో ఎలాంటి మంచి రెస్పాన్స్ ను దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
లేటెస్ట్ గా నాగౌశర్య నటించిన చిత్రం ‘రంగబలి’(Rangabali) . ఫన్ అండ్ యాక్షన్ తో కూడిన ఈ చిత్రంతో ప్రేక్షకులను మెప్పిస్తాననే నమ్మకంతో ఉన్నారు. రీసెంట్ గా వచ్చిన ఈ చిత్ర ట్రైలర్ కూడా ఆకట్టుకుంటోంది. కామెడీ, ఎమోషన్స్, యాక్షన్ అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. మరోవైపు ఈచిత్రాన్ని మరింతగా ప్రమోట్ చేసుకునేందుకు నాగశౌర్య ఆయా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. రీసెంట్ గా కూకట్ పల్లిలో ఓ యువకుడితో గొడవ పడటంపై క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇక తాజాగా టాలీవుడ్ క్రేజీ అండ్ బిజీయెస్ట్ హీరోయిన్ శ్రీలీలా (Sreeleela) గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు. నాగశౌర్య కేరీర్ లో మంచి రిజల్ట్ ను ఇచ్చిన చిత్రాల్లో ‘ఛలో’ ఒకటి. నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటించింది. వెంకీ కుడుము దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2017లో విడుదలైంది. అయితే ఈ చిత్రం గురించి లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరోయిన్ ఎంపిక గురించి నాగశౌర్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
నాగశౌర్య మాట్లాడుతూ.. ఛలో సినిమాకు మొదట శ్రీలీలానే హీరోయిన్ గా అనుకున్నాం. చివరి వరకు ఆమె కథానాయికగా ఉన్నారు. కానీ లాస్ట్ లో కన్నడ నటి రష్మిక మందన్న ఫైనల్ అయ్యారని చెప్పారు. దీంతో శ్రీలీలా ఎప్పుడో టాలీవుడ్ లో అడుగుపెట్టాల్సిందని అర్థమవుతోంది. రష్మిక ప్లేస్ లో అప్పుడు శ్రీలీలా ఎంపికై ఉంటే ప్రస్తుతం నేషనల్ క్రష్ ఆమె అయ్యేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఏదేమైనా రష్మిక మందన్న ఇటు సౌత్, అటు నార్త్ లో భారీ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ ఉన్నారు. సినిమా సినిమాకు మరింత క్రేజ్ దక్కించుకుంటున్నారు. ఇటు Sreeleela సైతం కాస్తా లేట్ గా ఎంట్రీ ఇచ్చానా వరుస చిత్రాలతో అదీ స్టార్ హీరోల సరసన నటించే ఛాన్సులు దక్కించుకొని దుమ్ములేపుతున్నారు. ప్రస్తుతం ఈమె చేతిలో తొమ్మిది సినిమాలున్నాయంటే మాటలు కాదు.
ఇక ‘రంగబలి’ చిత్రం కమర్షియల్ అంశాలతో రూపొందింది. పవన్ బసంశెట్టి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. `దసరా` విలన్ షైన్ టామ్ చాకో నెగటివ్ రోల్ చేస్తుండటం విశేషం. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంస్థ నిర్మిస్తుంది. యుక్తీ దరేజా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం జులై 7న విడుదల కాబోతుంది.