నిర్మాతని ముంచేసిన సీఎం కొడుకు, రూ.25 కోట్లు నష్టం.. లబోదిబోమంటూ కోర్టుకి..

Published : Jun 29, 2023, 04:12 PM IST
నిర్మాతని ముంచేసిన సీఎం కొడుకు, రూ.25 కోట్లు నష్టం.. లబోదిబోమంటూ కోర్టుకి..

సారాంశం

హీరోలకు అడ్వాన్సులు ఇచ్చి ముందుగానే బుక్ చేసుకుంటుంటారు నిర్మాతలు. సినిమా చకచకా షూటింగ్ పుర్తయి రిలీజ్ అయితే నిర్మాతకు సగం భారం తీరుతుంది. ఆలస్యం జరిగేకొద్దీ వడ్డీల భారం అధికం అవుతూ ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటారు.

హీరోలకు అడ్వాన్సులు ఇచ్చి ముందుగానే బుక్ చేసుకుంటుంటారు నిర్మాతలు. సినిమా చకచకా షూటింగ్ పుర్తయి రిలీజ్ అయితే నిర్మాతకు సగం భారం తీరుతుంది. ఆలస్యం జరిగేకొద్దీ వడ్డీల భారం అధికం అవుతూ ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటారు. ఇప్పుడు కోలీవుడ్ లో రామ శరవణన్ అనే నిర్మాత ఇలాంటి సమస్యలోనే చిక్కుకున్నాడు. 

ఈ సమస్యలు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు.. మంత్రి, నటుడు అయిన ఉదయనిధి స్టాలిన్ వల్లే అని తెలుస్తోంది. ఉదయనిధి స్టాలిన్ తమిళనాట తండ్రి బాటలో అటు రాజకీయాల్లో రాణిస్తూ సినిమాలు కూడా చేస్తున్నాడు. కోవిడ్ కి ముందు శరవణన్.. ఉదయనిధి స్టాలిన్ తో ఓ చిత్రం చేయాలనుకున్నారు. స్టాలిన్ కి రూ. 30 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చారు. 

పాయల్ రాజ్ పుత్, స్టాలిన్ ప్రధాన పాత్రలో ఏంజెల్ అనే చిత్రం ప్రారంభం అయింది. కొంత భాగం షూటింగ్ జరిగాక కోవిడ్ మొదలైంది. అప్పటి నుంచి నిర్మాతకు సమస్యలు మొదలయ్యాయి. ఇంతలో ఉదయనిధి స్టాలిన్ మంత్రి కావడంతో ఆయన భాద్యతలు పెరిగాయి. ఆ తర్వాత స్టాలిన్ మామన్నన్ అనే చిత్రాన్ని ప్రకటించారు. అదే తన చివరి చిత్రం అని కూడా అనౌన్స్ చేశారు. ఉదయనిధి స్టాలిన్ ఏంజెల్ చిత్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. 

కాగా నేడు స్టాలిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన మామన్నన్ నేడు రిలీజ్ అయింది. దీనితో శరవణన్ మామన్నన్ రిలీజ్ అడ్డుకోవాలని కోర్టు మెట్లెక్కారు. తనకి న్యాయం చేయకుండా స్టాలిన్ మామన్నన్ చిత్రాన్ని రిలీజ్ చేసుకుంటున్నాడు అని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే నేను ఏంజెల్ చిత్రానికి చాలా మొత్తం ఖర్చు చేశాను. ఈ చిత్రం పూర్తయి రిలీజ్ 25  కోట్ల వరకు నష్టం వస్తుందని కోర్టులో నిర్మాత మొరపెట్టుకున్నారు. 

అయితే ఏంజెల్ మూవీ ఆలస్యానికి, ఉదయనిధి స్టాలిన్ కి ఎలాంటి సంబంధం లేదని కోర్టు విచారణలో తేలింది. దీనితో మామన్నన్ చిత్ర రిలీజ్ కి క్లియరెన్స్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. కానీ స్టాలిన్ ఈ చిత్రాన్ని పూర్తి చేస్తాడో లేదో చూడాలి. 

 

PREV
click me!

Recommended Stories

Nagarjuna తో పోటీకి దిగి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లరి నరేష్, ఇంతకీ ఆమూవీ ఏదో తెలుసా?
Savitri: మహానటి జీవితం నాశనం కావడానికి జెమినీ గణేషన్‌, పొలిటీషియన్‌ మాత్రమే కాదు, ఆ మూడో వ్యక్తి ఇతడేనా?