Spy OTT Details: నిఖిల్ స్పై ఓటీటీలో...  అక్కడ చూసేయండి!

Published : Jun 29, 2023, 03:34 PM ISTUpdated : Jun 29, 2023, 03:43 PM IST
Spy OTT Details: నిఖిల్ స్పై ఓటీటీలో...  అక్కడ చూసేయండి!

సారాంశం

హీరో నిఖిల్ లేటెస్ట్ మూవీ స్పై. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ మూవీ డిజిటల్ పార్టనర్ ఎవరనే సమాచారం అందుతుంది.   

నిఖిల్ సిద్ధార్థ్ స్పై గా థియేటర్స్ లో దిగాడు. దర్శకుడు గ్యారీ బిహెచ్ తెరకెక్కించారు. స్పై చిత్రానికి మిక్స్డ్ టాక్ దక్కింది. నిఖిల్ పెర్ఫార్మన్స్ అద్భుతం అంటున్నారు. స్పై వన్ మాన్ షో అన్నమాట వినిపిస్తుంది. ఏది ఏమైనా నిఖిల్ మరో భారీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. దీని ఫలితం ఏమిటనేది వీకెండ్ తెలిసిపోనుంది. నేడు బక్రీద్ పండగ  స్పై చిత్రానికి  లాంగ్ వీకెండ్ దక్కింది. ఈ అవకాశాన్ని ఏ మేరకు ఉపయోగించుకుంటారో చూడాలి.

కాగా స్పై ఓటీటీ హక్కులు అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. కాబట్టి ప్రైమ్ చందాదారులు స్పై చిత్రాన్ని నాలుగు వారాల అనంతరం ఇంట్లో ఎంజాయ్ చేయవచ్చు. అయితే స్పై వంటి యాక్షన్ థ్రిల్లర్స్ బిగ్ స్క్రీన్ పై చూస్తే వచ్చే మజా వేరు. ఫ్యాన్సీ ధర చెల్లించి ప్రైమ్ స్పై మూవీ ఓటీటీ రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం. 

నిఖిల్ కి జంటగా ఐశ్వర్య మీనన్ నటించారు. ఆర్యన్ రాజేష్, మకరంద్ దేశ్ పాండే, జిష్హు కీలక పాత్రల్లో అలరించారు. కాగా నిఖిల్ స్వయంభు టైటిల్ తో మరో పాన్ ఇండియా చిత్రం ప్రకటించారు. నిఖిల్ లైన్ అప్ చూసిన కొందరు ఓ పార్టీ కోసం ప్రాపగాండా చిత్రాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. నాకు ఏ పార్టీలో సంబంధం లేదని నిఖిల్ ఓపెన్ అయ్యారు. నిఖిల్ నెక్స్ట్ స్వయంభు పీరియాడిక్ డ్రామా అని తెలుస్తుంది. ఫస్ట్ లుక్ ఆసక్తి రేపింది. 
 

PREV
click me!

Recommended Stories

Kalyan Padala Remuneration: కళ్యాణ్ పడాల పారితోషికం, ప్రైజ్ మనీ ఎంత? విజేతకు అందే కళ్లు చెదిరే బహుమతులు ఏవో తెలుసా?
Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?