టెర్మనేటర్..భవిష్యత్ నుంచి కాలంలో ప్రయాణించి ఇప్పటి కాలానికి వెనక్కి వచ్చినట్లు... ఇక్కడ ప్రభాస్ సినిమాలో ముందుకు వెళ్తారు.
ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ప్రాజెక్ట్ కే (Project k). ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో దీపికా పడుకోణ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతోనే దీపికా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తోన్నారు. అలాగా రీసెంట్ గా కమల్ హాసన్ ని ఒప్పించి సినిమాలోకి తీసుకువచ్చారు.
ఇండియన్ సినిమా హిస్టరీలోనే హయ్యెస్ట్ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా ప్రాజెక్ట్ కే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కు ఓ రేంజిలో క్రేజ్ క్రియేట్ అవుతున్న నేపధ్యంలో ఈ చిత్రంపై రకరకాలు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం స్టోరీలైన్ అంటూ ఒకటి వినిపిస్తోంది. ఇంతకీ అదేమిటంటే...
ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ప్రాజెక్ట్ K’ చిత్రం సైన్స్ ఫిక్షన్ సినిమా. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలకానున్నట్లు సమాచారం. ఈ ఫ్రాంచైజీ మొదటి భాగంలో ప్రభాస్... కమల్ తో పోరాడేందుకు భవిష్యత్తులోకి అంచే 2600 సంవత్సరంలోకి ప్రయాణిస్తారట. అందుకు దారి తీసే పరిస్దితులు ...ఆ కాలానికి ప్రయాణించేందుకు ప్రభాస్ సిద్ధం కావడంతో ముగుస్తుంది. ఇక ఫ్రాంచైజీ 2వ భాగం పూర్తిగా ప్రభాస్, కమల్ హాసన్ మధ్యే నడవనున్నట్లు తెలుస్తోంది. టెర్మనేటర్..భవిష్యత్ నుంచి కాలంలో ప్రయాణించి ఇప్పటి కాలానికి వెనక్కి వచ్చినట్లు... ఇక్కడ ప్రభాస్ సినిమాలో ముందుకు వెళ్తారు.
‘ప్రాజెక్ట్ K’షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తి అయ్యింది. కమల్ హాసన్, ప్రభాస్ మధ్య సన్నివేశాలు మాత్రమే బ్యాలన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోనే సీన్స్ ఇంకో పది రోజులు షూటింగ్ చేస్తే పూర్తి కానున్నాయి అని తెలుస్తోంది.
ఈ సినిమా భారతీయ ఇతిహాసం మహాభారతం స్పూర్తితో మూడో ప్రపంచ యుద్దం నేపథ్యంలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ సినిమా అని చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కర్ణుడిని పోలిన పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. ఇక ఈ భారీ చిత్రంలో సుదీర్ఘమైన ఐదు యాక్షన్ బ్లాకులు ఉన్నాయట. ఈ యాక్షన్ సీన్స్‌ను ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడని రీతిలో తెరకెక్కిస్తున్నారట నాగ్ అశ్విన్.. అందులో భాగంగానే హాలీవుడ్ నుంచి ఓ నలుగురు యాక్షన్ డైరెక్టర్లను దించారట.