మమ్మల్ని తొక్కేస్తున్నారు, థియేటర్లు ఇవ్వట్లేదు, నాగవంశీ ఆవేదన.. నవ్వి ఆసుపత్రిలో పడితే బిల్లు నాదే

Mad 2: నిర్మాత నాగవంశీ ఏదైనా బోల్డ్ గా చెబుతారు. ఓపెన్‌గా స్టేట్‌మెంట్‌ ఇస్తారు. తాజాగా ఆయన `మ్యాడ్‌ 2` సినిమాకి థియేటర్లు ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
 

producer naga Vamsi worried about theaters for mad 2 crazy comments in telugu arj

Mad 2: ఈ వారం `మ్యాడ్‌ 2`, `రాబిన్‌ హుడ్‌`, `లూసిఫర్‌ 2`, `వీరధీరశూర` నాలుగు చిత్రాలు వస్తున్నాయి. వీటిలో అన్నిటికంటే బాగా బజ్‌ ఉన్న మూవీ `మ్యాడ్‌ 2`. గతంలో వచ్చిన సినిమా హిట్‌ కావడం, `మ్యాడ్‌ 2` ట్రైలర్‌ ఆకట్టుకోవడంతో దీనిపై బజ్‌ నెలకొంది. సిచ్చ్యూవేషనల్‌ కామెడీతో వచ్చిన మూవీస్‌ బాగా వర్కౌట్‌ అవుతుంటాయి. అలానే ఈ మూవీ కూడా అలానే ఉండబోతుందని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. 

`మ్యాడ్‌ స్వ్కేర్‌` సినిమా చూసి అతిగా నవ్వి ఆసుపత్రిలో చేరితే బిల్లు నేనే కడతాః నాగవంశీ

అయితే ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ చేశారు నిర్మాత నాగవంశీ. సినిమా చూసి అతిగా నవ్వి ఆసుపత్రిలో పడితే నాది గ్యారంటీ అని, ఆసుపత్రి ట్రీట్‌మెంట్‌ బిల్లు మొత్తం నాదే అని,

Latest Videos

ఎంత మందికైనా తాను ట్రీట్‌మెంట్‌ ఇప్పించేందుకు రెడీ అంటూ ఓ ప్రశ్నకి స్పందించారు. నాలుగు సినిమాలతో పోటీగా వచ్చినా, కంటెంట్‌పై నమ్మకంతో వస్తున్నట్టు తెలిపారు. 

`మ్యాడ్‌ 2`కి థియేటర్లు ఇవ్వడం లేదు, మమ్మల్ని తొక్కేస్తున్నారుః నాగవంశీ

ఈ సందర్భంగా మరో తన ఆవేదన వ్యక్తం చేశారు. తమ సినిమాలకు థియేటర్లు ఇవ్వడం లేదని, తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా తక్కువ థియేటర్లు ఇచ్చారు.

చిన్న సినిమా అని తొక్కేస్తున్నారు. దీనికి అందరు సపోర్ట్ చేయాలని, థియేటర్లు ఇప్పించాలని కోరుకుంటున్నా అని తెలిపారు నాగవంశీ. ఆయన చాలా ఫన్నీగా ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం. 

చిన్న సినిమాల గురించి కాదు, ఆ ఐదుగురు పెద్ద హీరోల గురించి కామెంట్‌ చేశాః నాగవంశీ

ఇటీవల ఆయన సినిమాల్లో కథ, కథనం ఎవడికి కావాలంటూ కామెంట్‌ చేశారు. దీనిపై రియాక్ట్ అవుతూ, తాను చేసినా ఆ కామెంట్‌ని బూతులా చూస్తున్నారని, కానీ తాను అన్నది ఆ టాప్‌ ఐదారు మంది హీరోలను ఉద్దేశించి అని, మిగిలిన మూవీస్‌ గురించి కాదన్నారు.

`మ్యాడ్‌ 2` హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ అని, రెండున్నర గంటలు నవ్వుకుని వెళ్లొచ్చు అన్నారు. కథ, లాజిక్‌ లు వెతక్కుండా సినిమా చూస్తే ఎంజాయ్‌ చేస్తారని తెలిపారు. 

ఆద్యంతం హిలేరియస్‌గా `మ్యాడ్‌ 2` ట్రైలర్‌

నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ హీరోలుగా, విష్ణు కీలక పాత్రలో `మ్యాడ్‌ స్వ్కేర్‌`(మ్యాడ్‌ 2) మూవీని తెరకెక్కింది. కళ్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 28న విడుదల కానుంది. తాజాగా బుధవారం ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్ ను గమనిస్తే, `మ్యాడ్` విజయానికి కారణమైన ప్రత్యేక శైలి హాస్యం, ప్రధాన పాత్రల అల్లరిని మ్యాడ్ స్క్వేర్ లో కూడా చూడబోతున్నామని అర్థమవుతోంది.

హాస్యాస్పదమైన సంభాషణలు, విచిత్రమైన పరిస్థితులతో మ్యాడ్ స్క్వేర్ వినోదాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్తుంది. అలాగే తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం ట్రైలర్ కు ప్రధాన బలాలలో ఒకటిగా నిలిచింది. హిలేరియస్ కామెడీగా ఈ మూవీ ఉండబోతుందని అర్థమవుతుంది.  
 

read more:ఎన్టీఆర్‌, నెల్సన్‌ మూవీ లేదా? షాకిచ్చిన నిర్మాత.. త్రివిక్రమ్‌తో బన్నీ, తారక్‌ మూవీస్‌ ఎప్పుడంటే?

vuukle one pixel image
click me!