Breaking : హీరోయిన్ ఐశ్వర్యారాయ్ కారు ప్రమాదం

బాలీవుడ్ స్టార్ అమితాబచన్ కోడలు, హీరోయిన్ ఐశ్వర్యారాయ్ కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. 

Aishwarya Rai Car hit by local bus in Mumbai in telugu akp

Aishwarya Rai : ప్రముఖ సినీనటి ఐశ్వర్యారాయ్  కారు ప్రమాదానికి గురయ్యింది. ఇవాళ(బుధవారం) ముంబైలో ఈ ప్రమాదం జరిగింది. ఐశ్వర్యారాయ్ కి చెందిన లగ్జరీ కారును బస్సు ఢీకొట్టింది.  దీంతో కారు వెనకబాగం దెబ్బతింది. 

అయితే ఈ సమయంలో ఐశ్వర్యారాయ్ లేదా బచ్చన్ ఫ్యామిలీకి చెందిన ఇంకెవరైనా కారులో ఉన్నారా? వారికేమైనా గాయాలయ్యాయా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో తప్పు ఎవరిదో కూడా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గురయిన కారు దాదాపు కోటి రూపాయలకు పైనే ఉంటుంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Latest Videos

A post shared by Varinder Chawla (@varindertchawla)

వెనకనుండి వచ్చిన బస్సు కారును ఢీకొట్టింది. ప్రమాదం జరిగినవెంటనే చుట్టుపక్కలవారు అక్కడ గుమిగూడారు. అక్కడ ఐశ్వర్యారాయ్ లేదా బచ్చన్ కుటుంబసభ్యులు కనిపించలేదు. అంటే కారులో ఎవరూ లేరా? లేదంటే జనాలు గుమిగూడేసరికి వేరే వాహనంలో అక్కడినుండి వెళ్ళిపోయారా? అన్నది తెలియాల్సి ఉంది. 

ఈ ప్రమాదంపై ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు.  ప్రమాద స్థలం నుండి బస్సుతో పాటు కారును కూడా ఎవరికివారు తీసుకెళ్ళారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. 

ప్రమాదానికి గురైన ఐశ్వర్యా కారు ధర ఎంతో తెలుసా?  

ఐశ్వర్యారాయ్ ఉపయోగించే టయోటా వెల్ ఫైర్ కారు విఐపి ల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. దీని ధర రూ.1.30 లక్షలు ఉంటుంది.  గతేడాదే మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ ఈ కారును కొనుగోలు చేసారు. 

ఈ టయోటా వెల్‌ఫైర్ కారు మరికొందరు బాలీవుడ్ స్టార్స్ వద్దకూడా ఉంది. ఐశ్వర్యా భర్త అభిషేక్ భచ్చన్ వద్ద కూడా ఇలాంటి కారు ఉంది. అలాగే అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, సంజయ్ కపూర్, రాకేష్ రోషన్ వద్ద కూడా ఈ మోడల్ కార్లు ఉన్నాయి. 

vuukle one pixel image
click me!