#RRR: దానయ్యకు రాజమౌళి మధ్య ఏం జరిగింది.. ఈ స్టేట్మెంట్ ఏంటి?

Published : Mar 14, 2023, 04:25 PM IST
 #RRR: దానయ్యకు రాజమౌళి మధ్య ఏం జరిగింది.. ఈ స్టేట్మెంట్ ఏంటి?

సారాంశం

ఆర్.ఆర్.ఆర్  సినిమా లో నాటు నాటు పాట ఆస్కార్‌కు గెలుచుకున్న  సంగతి తెలిసిందే. అయితే ఆ ఈవెంట్ లో నిర్మాత దానయ్య ఎక్కడా కనపడలేదు. 

“నేను వాస్తవానికి రాజమౌళి లేదా రామ్ చరణ్ లేదా RRR టీమ్ నుండి ఎవరితోనూ టచ్‌లో లేను. నేను నిర్మించిన సినిమాలోని పాటకు ఆస్కార్ అవార్డు రావడం సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని మంచి సినిమాలు చేస్తానని నిర్మాత  దానయ్య అన్నారని  మీడియాలో వచ్చిన వార్త వైరల్ అవుతోంది.

ఆర్.ఆర్.ఆర్  సినిమా లో నాటు నాటు పాట ఆస్కార్‌కు గెలుచుకున్న  సంగతి తెలిసిందే. అయితే ఆ ఈవెంట్ లో నిర్మాత దానయ్య ఎక్కడా కనపడలేదు. అలాగే అంతకు ముందు జరిగిన  గోల్డేన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్‌లో గానీ, లేక హాలీవడ్ క్రిటిక్స్ అవార్డ్ ఫంక్షన్‌లోగానీ.. లేక ఇతర హాలీవుడ్ స్రీనింగ్స్‌లో ఎక్కడా కూడా నిర్మాత దానయ్య  కనిపించలేదు. 

ఒక్క నిర్మాత దానయ్య తప్ప అందరూ.. డైరెక్టర్ రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, చివరకు రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా స్టేజీలపై కనపడ్డారు.. కానీ నిర్మాత దానయ్య మాత్రం ఎక్కడా అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. మొదట్లో సినిమా రిలీజ్ అప్పుడు ప్రమోషన్స్ సమయంలో కనిపించిన దానయ్య.. ఇక ఇప్పటివరకు ఏ ఒక్క అవార్డు ఫంక్షన్‌లోను కనిపించలేదు. 

 అసలు ఎందుకు ఆర్ ఆర్ ఆర్ టీమ్ దానయ్యను దూరం పెడుతోందనేది ఎవరికీ అర్దం కావటం లేదు. అయితే కొందరు చెప్పేదాని  ప్రకారం.. ఆస్కార్ నామినేషన్స్ కోసం చేయాల్సిన రకరకాల ప్రమోషన్స్.. ఇతర ఈవెంట్ ఖర్చులు దానయ్య ఇవ్వలేదని.. రాజమౌళి స్వయంగా అవన్ని దగ్గరుండి చూసుకున్నాడని.. దీనికోసం దాదాపుగా 80 కోట్ల వరకు ఖర్చు అయ్యిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో దానయ్య టీమ్‌కు దూరం అయ్యి ఉండోచ్చని మరో వార్త వినపడుతోంది. 

 అల్లూరి సీతారామరాజు పాత్ర లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు కొమురంభీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన పాన్ ఇండియన్ సినిమా "అర్ ఆర్ ఆర్". భారీ అంచనాల మధ్య క్రితం సంవత్సరం  మార్చి 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిచింది.

డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య ఈ సినిమాని 450 కోట్ల బడ్జెట్తో నిర్మించింది. విడుదలకు ముందు నుంచే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా ఈ సినిమా బాగానే వసూలు చేసింది. ఈ చిత్ర థియేటరికల్ మరియు డిజిటల్ రైట్స్ ను డి.వి.వి.దానయ్య ఏకంగా ఏడు వందల కోట్లకు పైగానే అమ్మినట్లు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం దానయ్య మాత్రం ఈ సినిమా కి వచ్చిన ప్రాఫిట్ లో కేవలం 25 కోట్లు మాత్రమే తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగతా డబ్బులు సినిమా బడ్జెట్ కోసం తీసుకున్న అప్పు లకు,వడ్డీలకు చెల్లించాల్సి  వచ్చిందని చెప్తున్నారు .

ఇక ఆర్ ఆర్ ఆర్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషాల్లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను రాబట్టి అబ్బుర పరిచింది. కీరవాణి సంగీతం అందించగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని అందించారు. ఇక ఇండియాలో థియేటర్ రన్ ముగియడంతో ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ (హిందీ), జీ5(తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం) లో స్ట్రీమింగ్ అవుతోంది.
 

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు