పాప్ సింగర్ తో నాటు నాటు సింగర్స్.... వారి రియాక్షన్ ఇదే..!

Published : Mar 14, 2023, 03:24 PM IST
 పాప్ సింగర్ తో నాటు నాటు సింగర్స్.... వారి రియాక్షన్ ఇదే..!

సారాంశం

ట్విట్టర్ , ఇన్‌స్టాగ్రామ్‌లో, కాలా భైరవ , రాహుల్ సిప్లిగంజ్ 95వ అకాడమీ అవార్డ్స్‌లో నాటు నాటు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌తో కలిసి రిహన్నాను కలిసిన విషయాన్ని వెల్లడించారు.  

తెలుగు సినిమాకి ఆస్కార్ దక్కింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాటను సింగర్స్ కాల భైరవ, రాహుల్ సిప్లిగింజ్ లు పాడారు.  నాటు నాటు ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా అకాడమీ అవార్డును గెలుచుకున్నప్పటి నుంచి ఈ ఇద్దరు సింగర్స్ మరింత పాపులర్ అయ్యారు. కాగా.. ఆస్కార్ వేదిక వద్ద.. ఈ ఇద్దరు సింగర్స్... పాప్ సింగర్ రిహన్నాను కలిశారు. ఆ విషయాన్ని ఇద్దరు సింగర్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 

ట్విట్టర్ , ఇన్‌స్టాగ్రామ్‌లో, కాలా భైరవ , రాహుల్ సిప్లిగంజ్ 95వ అకాడమీ అవార్డ్స్‌లో నాటు నాటు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌తో కలిసి రిహన్నాను కలిసిన విషయాన్ని వెల్లడించారు.

 

 భైరవ పాప్ గాయకురాలు రిహన్నా తో ఒక చిత్రాన్ని పంచుకున్నారు. “ఇది జరిగినప్పుడు నాకు పదాలు లేవు. ఓ కళాకారుడుగా.. ఆమెను నేను ఎప్పుడూ ఆరాధిస్తే ఉంటాను." అని కాలబైరవ ఆమెతో దిగిన ఫోటోని షేర్ చేశారు. ఆ ఫోటోలో రాహుల్ సప్లిగంజ్ కూడా ఉన్నారు.

ఇక రాహుల్ సిప్లిగంజ్ తన సోషల్ ఆమె తో దిగిన సింగిల్ ఫోటోని షేర్ చేశారు.  క్యాప్షన్ లో తాను ఓ అద్భుతమైన మహిళను కలుసుకున్నట్లు చెప్పారు. ఆమె వియనాన్ని చూసి తాను షాకైనట్లు చెప్పారు. ఆమె చాలా డౌన్ టూ ఎర్త్ అంటూ... క్యాప్షన్ లో పేర్కొన్నారు. తనకు ఇది చాలా ఎమోషనల్ మూమెంట్ అంటూ పేర్కొనడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే