అలిగిన అవతార్ డైరెక్టర్, ఆస్కార్ కు డుమ్మా కొట్టిన జేమ్స్ కామరాన్

Published : Mar 14, 2023, 04:10 PM IST
అలిగిన అవతార్ డైరెక్టర్, ఆస్కార్ కు డుమ్మా కొట్టిన జేమ్స్ కామరాన్

సారాంశం

ఈసారి ఆస్కార్ వేడుకలకు మనకు మరచిపోని జ్ఞాపకంగా మిగిలిపోయాయి. ఇండియాకు రెండు ఆస్కార్లు రావడం.. అది కూడా తెలుగు సినిమా.. అచ్చ తెలుగు పాటకు ఆస్కార్ రావడంతో అంతా సంబరాల్లో మునిగిపోయారు. ఈక్రమంలో ఆస్కార్ లో అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామరాన్ మాత్రం కనిపించలేదు. ఆయన అలిగారా..? అందుకే ఆస్కార్ కు రాలేదా..? అసలేం జరిగింది...? 

ప్రపంచ సినిమా ఎంతో  ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే ఆస్కార్స్ వేడుక లాస్ ఏంజిల్స్ లో ఎంతో ఘనంగా జరిగింది. ఇండియా తరపునుంచి మూడు సినిమాలు నామినేట్ అవ్వగా. . రెండు సినిమాలకు ఆస్కార్ వరించింది. అందులో దేశం అంతా ఉత్కంఠగా ఎదురు చూసిన ఆర్ఆర్ఆర్ లోని నాటునాటు పాటను ఆస్కార్ వరించింది. ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అఫీషియల్ గా ఆర్ఆర్ఆర్ ను ఆస్కార్ పోటీకి పంపించకపోయినా.. తన సత్తా చాటి రాజమౌళి ఆస్కార్ లో ఎంట్రీ సాధించాడు. నామినేట్ అయ్యి.. చివరకు ఆస్కార్ విన్ అయ్యాడు. ఇక ఈసినిమాతో పాటు ఆస్కార్ బరిలో అవతార్2 లాంటి సినిమాలు కూడా నామినేషన్స్ కు వచ్చాయి. 

అవతార్2 ఇండియాన్స్ బాగా ఆదరించిన సినిమా.. ఈసినిమా 4కాటగిరీలలో ఆస్కార్ కునామిటే అవ్వగా.. బెస్ట్ విజువ‌ల్ ఎఫెక్ట్స్ కి ఆస్కార్ వరించింది.  కానీ ఆ ఈవెంట్‌కు అవతార్  డైరెక్ట‌ర్ జేమ్స్ కెమ‌రూన్  డుమ్మా కొట్టారు. ఆయ‌న తీసిన అవ‌తార్ 2కు బెస్ట్ విజువ‌ల్ ఎఫెక్ట్స్ కేట‌గిరీలో అవార్డు వ‌చ్చినా. కానీ ఆయ‌న అవార్డు ఫంక్ష‌న్‌కు రాలేదు. అయితే ఆయన రాకపోవ‌డానికి కార‌ణం ఉంద‌ని అంటున్నారు సినిమా పండితులు.  డిస్నీకి చెందిన అవతార్‌2 మొత్తం నాలుగు కేట‌గిరీల్లో  పోటీప‌డింది. బెస్ట్ పిక్చ‌ర్ విభాగంలోనూ ఆ సినిమా ఉంది. కానీ బెస్ట్ డైరెక్ట‌ర్ కేట‌గిరీలో మాత్రం జేమ్స్ కెమరూన్ నామినేట్ అవ్వలేదు. ఆస్కార్ రాకపోయినా పర్వాలేదు కాని.. అసలు నామినేట్ అవ్వలేదు అంటేనే ఆయన తీసుకోలేకపోయారంటున్నారు. 

బెస్ట్ డైరెక్టర్ గా తనను  నామినేట్ చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే అలిగి ఆస్కార్  ఆస్కార్స్ వేడుక‌కు జేమ్స్ దూరంగా ఉన్న‌ట్లు రకరకాల వార్తు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఆస్కార్స్‌కు నామినేట్ అయిన వారితో.. అంతకు ముందు జరిగిన వేడుకల్లో మాత్రం.. ఆయన హుషారుగా పార్టిస్పేట్ చేశారు. ఆ వేడుకలోనే మన రాజమౌళిని కలిసి సందడి చేశారు కామరాన్. ఆర్ఆర్ఆర్ సినిమాను పొగడ్తతో ముంచెత్తారు.  అయితే ఈసారి ఆస్కార్ కు జేమ్స్ కామరాన్ రాకపోవడపై.. ఆస్కార్ హోస్ట్ జిమ్మీ కిమ్మల్ తనదైన స్టైల్లో స్పందించారు. వేదికపై ఓ జోక్ వేసి.. అందరిని నవ్వించేశారు. 

ఇక ఈసారి ఆస్కార్స్‌కు చాలా మంది హాలీవుడ్ స్టార్స్  దూరంగా ఉన్నారు.  టాప్ హీరోల్లో ఒకరైనా టామ్ క్రూజ్‌.. మిషన్ ఇంపాజిబుల్ షూటింగ్ లో ఉండటం...అది కూడా విదేశాల్లో జరగుతుండటంతో.. ఆయన రాలేకపోయారు. అంతే కాదు బాస్కెట్ బాల్ మ్యాచ్ లు  ఉండటంతో  డెంజిల్ వాషింగ్ట‌న్ కూడా ఆష్కార్ వేడుకలకురాలేదు. ఇక డెంజిల్  టాప్ గ‌న్ చిత్రం ఈసారి ఆరు అవార్డుల కోసం నామినేట్ అయ్యింది. ఇక మూడు సార్లు బెస్ట్ యాక్ట‌ర్ అవార్డు గెలుచుకున్న డెంజిల్ వాషింగ్ట‌న్ ఈసారి మాత్రం ఆస్కార్ ను స్కిప్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు