దిల్ రాజు నిండా మునిగాడంట

First Published 7, Oct 2017, 5:37 PM IST
Highlights
  • ఎన్నో అద్భుతమైన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన స్టార్ డైరెక్టర్ దిల్ రాజు
  • మహేష్, మురగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన స్పైడర్
  • స్పైడర్ సినిమాతో నష్టాల్లో పడ్డ దిల్ రాజు

తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఇటీవల కాలంలో ఆయన నిర్మాతగా వ్యవహించిన సినిమాలు వరుసగా విజయాలను కూడా అందుకున్నాయి. అయితే.. మహేష్  ‘స్పైడర్’ మాత్రం  దిల్ రాజుకి భారీ నష్టాలు తెచ్చిపెట్టిందట.  తమిళ స్టార్ దర్శకుడు మురగదాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో  సినిమా అనగానే అందరూ ఆచిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అంతేకాకుండా ప్రముఖ దర్శకుడు ఎస్ జే సూర్య విలన్ గా నటిస్తున్నాడు అనగానే అంచనాలు మరింత పెరిగిపోయాయి.

 

వాస్తవానికి మురుగదాస్ నేటి సమాజంలో సైబర్ క్రైమ్ ఎలా పెరిగిపోతోంది.. దాని వల్ల జరుగుతున్న నష్టాలు ఎంతో ఘోరంగా ఉన్నాయి అపూ విషయాన్ని సినిమాలో చూపించారు.  కాకపోతే టెక్నాలజీ పరంగా మైండ్ గేమ్ తో సాగిన ఈ చిత్రం మాస్ ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. థియేటర్లో  రిలీజ్ అయిన రోజు నుంచి సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది.  ఇక ఈ సినిమా పై రివ్యూలు కూడా పెద్దగా పేలలేదు. దీంతో సినిమా మొదటి నుంచి కలెక్షన్ల పరంగా డల్ గా నడుస్తుంది. 

 

దాదాపుగా స్పైడర్ సినిమా రిలీజ్ అయి వారం కావస్తోంది , కానీ తెలంగాణ లో  వసూల్ అయ్యింది కేవలం 12 కోట్లు మాత్రమే ! కానీ ఈ సినిమాని పొటీ పడి మరీ 25 కోట్లకు కొన్నాడు దిల్ రాజు. దీంతో ఆయనకు భారీ నష్టం వాటిల్లిందని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు.

 

Last Updated 25, Mar 2018, 11:46 PM IST