ఆడపడుచు కోసం తప్పదంటున్న ప్రియాంక!

Published : Nov 05, 2018, 06:29 PM ISTUpdated : Nov 05, 2018, 06:37 PM IST
ఆడపడుచు కోసం తప్పదంటున్న ప్రియాంక!

సారాంశం

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనకు క్రేజ్ ను పెంచుకుంటూ వెళ్లిన హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలేక్కబోతున్న సంగతి తెలిసిందే. నిక్‌ జోనాస్‌ తో కలిసి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తో తెగ ఎంజాయ్ చేస్తోంది. 

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనకు క్రేజ్ ను పెంచుకుంటూ వెళ్లిన హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలేక్కబోతున్న సంగతి తెలిసిందే. నిక్‌ జోనాస్‌ తో కలిసి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తో తెగ ఎంజాయ్ చేస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా సోషల్ మీడియాలో అమ్మడు పోటోలను తెగ షేర్ చేస్తోంది. 

ఇకపోతే రీసెంట్ గా తనకు కాబోయే వాడి కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసిన క్షణాలను అభిమానులతో పంచుకుంది. అందుకు సంబందించిన ఫొటోలు ఇంటర్నెట్ లో కూడా వైరల్ అవుతున్నాయి. ఇక రీసెంట్ గా నిక్‌ జోనాస్‌ సోదరితో కూడా ప్రియాంక తెగ ఎంజాయ్ చేసింది. ఆడపడుచు సోఫియా టర్నర్‌ ను ఎత్తుకొన్న వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. 

ఈ రోజుల్లో ఆడపడుచుల కోసం ఎన్నో చేయాల్సి వస్తోంది అంటూ ఆమె ఇచ్చిన క్యాప్షన్ నెటిజన్స్ ను ఆకట్టుకుంది. దీంతో ఫాలోవర్స్ వారి శైలిలో అమ్మడికి సమాధానాలు ఇస్తున్నారు. ఉదయపూర్ లో ప్రియాంక పెళ్లి జరగనుందని ప్రస్తుతం టాక్ వస్తున్నప్పటికీ అది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.

 

PREV
click me!

Recommended Stories

2025 Flop Heroines: 2025లో ఫ్లాప్ సినిమాలతో పోటీ పడ్డ హీరోయిన్లు.. వాళ్ళిద్దరికీ మూడేసి డిజాస్టర్లు
Sobhan babu జీవితాన్ని ఒక్క సినిమాతో నిలబెట్టిన ఎన్టీఆర్, ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా?