ప్రియాంక ఇంటి బడ్జెట్ ఎంతో తెలుసా..?

By AN TeluguFirst Published Aug 7, 2019, 5:00 PM IST
Highlights

గ్లోబల్‌ కపుల్‌ ప్రియాంక చోప్రా, నిక్‌ జోనస్‌ దంపతులు కొత్తిల్లు వేటలో ఉన్నారు. కొత్తిల్లు అంటే ఏదో ఆషామాషీగా ఇల్లు కొనుక్కోవాలని వీరు అనుకోవడం లేదు. ఏకంగా 20 మిలియన్‌ డాలర్లు (రు. 141 కోట్లు) ఖర్చు పెట్టి అత్యంత విలాసవంతమైన ఇంటిని సొంతం చేసుకోవాలని వీరు భావిస్తున్నారు. 
 

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. ప్రముఖ హాలీవుడ్ సింగర్ నిక్ ని పెళ్లి చేసుకొని అమెరికాలో నివాసముంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జంట కొత్త ఇల్లు తీసుకోవాలని భావిస్తున్నారు. ఆ ఇంటి కోసం ఏకంగా 20 మిలియన్ డాలర్లు బడ్జెట్ పెట్టుకున్నారు.

అమెరికాలోని హాలీవుడ్ కొలువైన్ లాస్ ఏంజిల్స్ లో ఓ అందమైన ఇంటిని సొంతం చేసుకోవడానికి ఈ జంట తీవ్రంగా ప్రయత్నిస్తుందని ఓ వెబ్ సైట్ కథనం ప్రచురించింది. నిక్ జోనస్ పెళ్లికి ముందు లాస్ ఏంజిల్స్ లో బెవర్లీ హిల్స్ లో ఉండేవాడు. 

ఆ ఇంటిని 6.5 మిలియన్ డాలర్లు పెట్టి సొంతం చేసుకున్నాడు. ఐదు బెడ్‌రూమ్‌లు, నాలుగుకు పైగా బాత్‌రూమ్‌లు, అద్భుతమైన స్విమ్మింగ్‌ పూల్‌, కిటికిలోంచి చూస్తే మంచి వ్యూ పాయింట్స్, ప్రకృతి కనిపించేలా ఉన్న ఈ విలాసవంతమైన ఇంటిని నిక్‌ ఇటీవల 6.9 మిలియన్‌ డాలర్లకు అమ్మేశాడు.

ఇప్పుడు ఈ జంట మరింత ఖరీదైన ఇంటిని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. వారు కోరుకుంటున్నట్లుగా ఇల్లు దొరుకుతుందేమో చూడాలి. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్ ప్రాజెక్ట్ లతోనే బిజీగా గడుపుతోంది.

click me!