మన్మథుడు 2 డైరక్టర్ కి లక్కీ ఛాన్స్..!

Published : Aug 07, 2019, 04:42 PM ISTUpdated : Aug 07, 2019, 05:17 PM IST
మన్మథుడు 2 డైరక్టర్ కి లక్కీ ఛాన్స్..!

సారాంశం

మన్మథుడు 2 సినిమా ఈ శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. నాగార్జున - రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు. చిలసౌ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ కి ఆ సినిమా రిలిజ్ కాకముందే పిలిచి మరి అవకాశం ఇచ్చాడు నాగ్. 

అయితే అదే తరహాలో కొన్ని నిర్మాణ సంస్థలు మన్మథుడు 2 విడుదల కాకముందే రాహుల్ కి గాలం వేస్తున్నాయి. అందులో సితారా ఎంటర్టైన్మెంట్స్ అలాగే హారిక హాసిని ప్రొడక్షన్స్ ముందున్నట్లు సమాచారం. మన్మథుడు 2 ప్రివ్యూ చూసిన కొంత మంది సినీ ప్రముఖులు రాహుల్ మేకింగ్ ని మెచ్చుకొని ఇండస్ట్రీ మొత్తం తెలిసేలా మాట్లాడుకుంటున్నారు. 

దీంతో జెర్సీ నిర్మాత అలాగే త్రివిక్రమ్ ఆస్థాన నిర్మాత చినబాబు ఒక్కటై రాహుల్ తో సినిమా చేయాలనీ ప్లాన్ వేస్తున్నారు. అయితే ఆ సినిమా అక్కినేని హీరోలతోనే ఉండవచ్చని మరో టాక్ వస్తోంది. ఎందుకంటే నాగ్ రాహుల్ కు ముందుగానే నాగ చైతన్యతో ఒక సినిమా చేయాలనీ మాట తీసుకున్నట్లు సమాచారం. రిలీజ్ కు ముందే రాహుల్ ఇమేజ్ ను పెంచుతున్న మన్మథుడు 2 విడుదలయ్యాక ఇంకా ఏ లెవెల్ కి తీసుకెళుతుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Nari Nari Naduma Murari Review: `నారీ నారీ నడుమ మురారి` మూవీ రివ్యూ.. శర్వానంద్‌ కి హిట్‌ పడిందా?
AALoki : అల్లు అర్జున్ దూకుడు, లోకేష్ కనగరాజ్ తో 23వ సినిమా ఫిక్స్, అఫీషియల్ అనౌన్స్ మెంట్