వైరల్ పిక్: మోక్షజ్ఞ ఇంకా రెడీ కాలేదు..?

Published : Aug 07, 2019, 04:18 PM ISTUpdated : Aug 07, 2019, 04:19 PM IST
వైరల్ పిక్: మోక్షజ్ఞ ఇంకా రెడీ కాలేదు..?

సారాంశం

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెరపైకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో గాని అతనికి సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గత ఏడాది నుంచి మోక్షజ్ఞ ఎంట్రీపై ఎన్నో పుకార్లు పుట్టుకొస్తున్నాయి. 

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెరపైకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో గాని అతనికి సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గత ఏడాది నుంచి మోక్షజ్ఞ ఎంట్రీపై ఎన్నో పుకార్లు పుట్టుకొస్తున్నాయి. రూమర్స్ ఎన్ని వచ్చినా బాలకృష్ణ మాత్రం కొడుకు తెరగ్రేటంపై స్పందించడం లేదు. 

ప్రస్తుతం బాలయ్య వారసుడికి సంబందించిన మరో ఫొటో కూడా ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. గతంలోనే మోక్షజ్ఞ ఫొటోలు చాలా వరకు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఇకపోతే రీసెంట్ గా తన స్నేహితుడితో దిగిన ఫొటోలో మోక్షజ్ఞ చాలా సింపుల్ గా కనిపిస్తున్నట్లు అనిపిస్తోంది. చూస్తుంటే బాలయ్య కొడుకు కోసం ఇంకా ఏ కథను సెట్ చేసినట్లు లేదు.

ఎందుకంటే మోక్షజ్ఞ మొదటి సినిమాలో  ఫిట్ నెస్ గా కనిపిస్తాడని రూమర్స్ వినిపించాయి. బాలయ్య కొన్ని కథలను కూడా సెట్ చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. అసలైతే ఎన్టీఆర్ బయోపిక్ లోనే టీనేజ్ ఎన్టీఆర్ గా మోక్షజ్ఞను చూపించాలని క్రిష్ అనుకున్నప్పటికీ బాలయ్య ఒప్పుకోలేదు. మంచి కథ దర్శకుడు దొరికితే మోక్షజ్ఞను ఎంట్రీ వీలైనంత త్వరగా ఉంటుందని ఇన్ సైడ్ టాక్.  

PREV
click me!

Recommended Stories

Avatar 3 Review: అవతార్‌ 3 మూవీ రివ్యూ, రేటింగ్‌.. జేమ్స్ కామెరూన్‌ ఇక ఇది ఆపేయడం బెటర్‌
Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్