
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ అందాల తార. అతి తక్కువ కాలంలో తన అందం, అభినయంతో బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగింది. విభిన్న కథాంశ చిత్రాల్లో నటించి, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రియాంక చోప్రా ఏదో ఒక కారణంతో మీడియాలోను, అలాగే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారుతుంది. అలాగే.. తన హాట్ హాట్ ఫోటోలను నెట్టింట్లో షేర్ చేస్తూ.. కుర్రా కారు గుండెల్లో హీట్ పుట్టిస్తోంది ఈ గ్లామర్ బ్యూటీ.
ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్‌ను సొంతం చేసుకొన్నది. ఇటు బాలీవుడ్.. అటు హాలీవుడ్ ల్లో వరుస సూపర్ హిట్ చిత్రాలను చేస్తూ.. గ్లోబల్ స్టార్ హీరోయిన్ గా మారింది.
ఇక అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. అనంతరం ప్రియాంక.. బాలీవుడ్లో సినిమాలను తగ్గించి.. వరుసగా.. హాలీవుడ్ సినిమాలను చేస్తూ.. బిజీ బిజీ అయిపోయింది. ప్రస్తుతం.. ఈ బ్యూటీ.. తన భర్తతో కలిసి లాస్ ఏంజెస్లో ఎంజెయ్ చేస్తోంది.
ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాల్లో తన భర్త నిక్ పేరును తీసివేయడంతో.. దూమారం చెలరేగింది. వీరిద్దరూ వీడిపోయారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పుకార్లు షికార్లు చేశాయి. అయితే.. ఈ రూమర్స్ మీద ప్రియాంక తనదైన స్టైల్స్ స్పందించింది. తాజాగా తన మూడో వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకొని.. వాటికి చెక్ పెట్టింది. అవీ అవాస్తమనీ తేల్చేసింది.
ఇదిలా ఉంటే.. మరో గాసిప్స్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ సమాచారం ప్రకారం ప్రియాంక తన భర్త నిక్ జోనాస్‌ను హీరోగా పరిచయం చేయాబోతుందట. తన భార్త నిక్ జోనస్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దం చేసుకున్నట్టు ఓ వార్త బీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఓ ప్రముఖ హిందీ దర్శకుడి దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఫ్లాన్ చేస్తుందట. తాజాగా నిక్ జోనస్ కూడా ఈ విషయం మీద ఓ క్లారటీ ఇచ్చాడు.
తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గోన్న బాలీవుడ్ సినిమాలో నటించనున్నట్టు చెప్పుకోచ్చారు. మరి నిక్ జోనస్ బాలీవుడ్ తెరంగేట్రం ఎలాంటి సినిమాతో ఉండబోతుందో చూడాలి. ఇక తన సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ది మ్యాట్రిక్స్ రీసర్రెక్షన్స్ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సతి అనే పాత్రలో నటించనున్నది ఈ బ్యూటీ. అలాగే టెక్ట్స్ ఫర్ యూ, సిటాడెల్ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ జోయా అఖ్తర్ రూపొందించే జీ లే జరా చిత్రంలో ఆలియా భట్, కత్రినా కైఫ్‌తో కలిసి నటిస్తున్నారు. మరోవైపు టాలీవుడ్ మిత్ర వింద కాజల్ కూడా తన భర్త గౌతమ్ కిచ్లును హీరోగా పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా టాక్.