వైన్ షాప్ లో మద్యం అమ్ముతున్న స్టార్ కమెడియన్

Published : Dec 02, 2021, 01:53 PM IST
వైన్ షాప్ లో మద్యం అమ్ముతున్న స్టార్ కమెడియన్

సారాంశం

స్టార్ కమెడియన్ గా బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించిన రఘు సడన్ గా వైన్ షాప్ లో ప్రత్యక్షం అయ్యాడు. ఆయన సేల్స్ మాన్ గా కస్టమర్లకు మద్యం అమ్మారు. రఘు నయా అవతార్ లో చూసిన అక్కడ మద్యం ప్రియులు షాక్ తిన్నారు. 

ఆది సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు రఘు కారుమంచి. ఆ సినిమాలో సీరియస్ ఫైట్ మధ్యలో రఘుతో ఎన్టీఆర్ కామెడీ బాగా నవ్వు తెప్పిస్తుంది. మొదటి సినిమాతోనే మంచి పాపులారిటీ తెచ్చుకోగా... దిల్, యోగి, అదుర్స్ వంటి చిత్రాలలో నటించారు. కెరీర్ నెమ్మదించడంతో జబర్దస్త్ షో కమెడియన్ గా మారారు. రోలర్ రఘు పేరుతో టీమ్ లీడర్ గా కొన్నాళ్ళు కొనసాగారు. కారణం ఏదైనా జబర్దస్త్ షో నుండి కూడా తప్పుకున్నాడు. 

కెరీర్ నిలకడగా లేకపోవడంతో ఆయన వ్యాపారం వైపు అడుగులు వేశారు. లిక్కర్ వైన్స్ వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన మద్యం దుకాణాల వేలంలో పాల్గొన్న రఘు.. నల్లగొండ పట్టణ శివారులోని మర్రిగూడ బైపాస్‌ పక్కనున్న అభినవ్ 1 & 2 దుకాణాలను చేజిక్కించుకున్నట్లు తెలిసింది. నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల మద్యం దుకాణాలు దక్కించుకున్న నిర్వాహకులు.. 

Also read Nagababu : నవ్వుల షోకి జడ్జిగా నాగబాబు!

అమ్మకాలను ప్రారంభించారు. ఇందులో భాగంగానే కమెడియన్ రఘు తనకు వచ్చిన మద్యం దుకాణాల ముందు పూజలు నిర్వహించి.. కాసేపు కౌంటర్లు నిలబడి మద్యం అమ్మాడు. తన మిత్రులతో కలిసి వేసిన మద్యం సిండికేట్ లో రెండు వైన్స్ షాపులను సొంతం చేసుకున్నాడు. కాగా.. మద్యం దుకాణాల టెండర్లలో ఈసారి చాలామంది కొత్త వాళ్లకు షాపులు దక్కాయి.

Also read Mahesh babu: షాకింగ్ న్యూస్... మహేష్ బాబుకు సర్జరీ!
 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే