బుల్లితెర పై 'టక్ జగదీష్' టీఆర్పీ ఎంతంటే !

By Surya PrakashFirst Published Dec 2, 2021, 4:10 PM IST
Highlights


 టీజర్‌, ట్రైలర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్‌ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  అయితే ఆ అంచనాలు ఈ ‘టక్‌ జగదీష్‌’ అందుకోలేక పోయిందని అన్నారు.  

 ప్రతి సినిమాలోనూ కొత్తదనం ఉండేలా చూసుకుంటూ, కొత్త తరహా పాత్రలు పోషిస్తూ, తనకంటూ స్పెషల్‌ ఫ్యాన్‌ బేస్‌ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నేచురల్‌ స్టార్‌ నటించిన తాజా చిత్రం ‘టక్‌ జగదీష్‌’.ఎక్కువగా  ప్రేమ కథా చిత్రాలతో అలరించే నాని.. తొలిసారి తెలుగింటి కుటుంబ కథను ఎంచుకున్నాడు. నానికి ‘నిన్నుకోరి’ లాంటి సూపర్‌ హిట్‌ అందించిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు వినాయకచవితి సందర్భంగా   ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది. 

 టీజర్‌, ట్రైలర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్‌ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  అయితే ఆ అంచనాలు ఈ ‘టక్‌ జగదీష్‌’ అందుకోలేక పోయిందని అన్నారు. కానీ చాలా మంది టాక్ తో సంభందం లేకుండా చూడటంతో వ్యూస్ బాగా వచ్చాయి. ఈ నేపధ్యలంలో రీసెంట్ గా టీవిల్లోనూ ఈ సినిమా ప్రసారమైంది.

 మామూలుగా నేచురల్ స్టార్ నానికి ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ చాలా ఉంటుంది. ఈ నేపథ్యంలో 'టక్ జగదీష్' మూవీని ఇటీవలే స్టార్ మా చానెల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం చేశారు.  ఈ చిత్రానికి 10.90 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇది మంచి రేటింగే అయినా నాని రేంజ్‌కు మాత్రం చాలా తక్కువే అన్న టాక్ అంటున్నారు.  
  అయినా నాని కి ఫ్యామిలీ ఆడియెన్స్ అండ ఉందనేది ఈ రేటింగ్ తో మరొకసారి రుజువైమది. షైన్ స్క్రీన్స్ పతాకం పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది లు నిర్మించారు.

ఈ సినిమాలో జగదీష్‌ నాయుడు అనే బ‌రువైన పాత్ర‌ని నాని అవ‌లీల‌గా పోషించేశాడు. ముఖ్యంగా ఎమ్మార్వో జగదీష్‌ నాయుడిగా అదరగొట్టేశాడు. హీరో అన్నయ్య బోసు పాత్రలో జగపతి బాబు జీవించేశాడు. చాలా కాలం తర్వాత జగపతి బాబు అన్నయ్య పాత్రను పోషంచి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో తండ్రి ఆదిశేషు నాయుడిగా నాజర్‌ తనదైన నటనతో మెప్పించాడు. వీఆర్వో గుమ్మడి వరలక్ష్మీ పాత్రలో రీతూవర్మ చక్కగా ఒదిగిపోయింది. హీరో మేనకోడలు చంద్ర పాత్రలో ఐశ్యర్య రాజేశ్‌ పర్వాలేదనిపించింది. అలాగే రావు రమేశ్‌, నరేశ్‌, మాలపార్వతి, రోహిని, దేవదర్శిని తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు. 

click me!