ఐదేళ్ల వయసు నుండి ఈ వ్యాధితో బాధపడుతున్నా.. స్టార్ హీరోయిన్ కామెంట్స్!

Published : Sep 18, 2018, 02:39 PM ISTUpdated : Sep 19, 2018, 09:29 AM IST
ఐదేళ్ల వయసు నుండి ఈ వ్యాధితో బాధపడుతున్నా.. స్టార్ హీరోయిన్ కామెంట్స్!

సారాంశం

సినిమా సెలబ్రిటీలను వెండితెరపై చూస్తూ వారి జీవితాలను చాలా గొప్పగా ఊహించుకుంటూ ఉంటాం. కానీ వారికి కూడా కొన్ని సమస్యలు, బాధలు ఉంటాయి. కానీ వాటిని మాత్రం ఎప్పుడూ బయటకి చెప్పరు.

సినిమా సెలబ్రిటీలను వెండితెరపై చూస్తూ వారి జీవితాలను చాలా గొప్పగా ఊహించుకుంటూ ఉంటాం. కానీ వారికి కూడా కొన్ని సమస్యలు, బాధలు ఉంటాయి. కానీ వాటిని మాత్రం ఎప్పుడూ బయటకి చెప్పరు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తనకు ఐదేళ్ల వయసున్నప్పటి నుండి ఆస్తమాతో బాధపడుతుందట.

ఈ విషయం తనకు దగ్గరగా ఉన్న చాలా తక్కువ మందికి మాత్రం తెలుసునని ప్రియాంక చెప్పుకొచ్చింది. సిప్లా కంపెనీకి చెందిన ఇన్హేలర్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది ప్రియాంక. ఈ క్రమంలో తన వ్యక్తిగత విషయాలను కూడా వెల్లడించింది. ''నాకు ఆస్తమా ఉందనే విషయం నాకు దగ్గరగా ఉన్న కొందరికి తెలుసు.

ఐదేళ్ల నుండి ఈ సమస్యతో బాధ పడుతున్నా.. మా అమ్మ డాక్టర్ కాబట్టి ఇన్హేలర్ ని సూచించింది. ఇది వాడడం మొదలుపెట్టిన తరువాత అలవాటుగా మారుతుందని అందరూ చెప్పారు. కానీ అలాటిదేమీ లేదు. దాని వల్ల నేను స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటున్నాను. ఆస్తమా నన్ను కంట్రోల్ చేసేలోపు నేను దాన్ని కంట్రోల్ చేయాలనుకున్నాను.

నా వద్ద ఇన్హేలర్ ఉన్నంతవరకు ఆస్తమా నన్ను ఎదగనివ్వకుండా ఆపలేదు. ఇన్హేలర్ తో ఎలాంటి సమస్యలు తలెత్తవు. ఇది ఆస్తమాని పూర్తిగా తగ్గించకపోయినా.. శ్వాస తీసుకోవడంలో మాత్రం సహాయపడుతుంది'' అంటూ చెప్పుకొచ్చింది. 
 

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?