ప్రియమణి ఇల్లాలైంది.. ప్రియుడు ముస్తఫా రాజ్ తో వివాహం

Published : Aug 23, 2017, 06:47 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
ప్రియమణి ఇల్లాలైంది.. ప్రియుడు ముస్తఫా రాజ్ తో వివాహం

సారాంశం

ప్రియమణి  ఇకనుంచి ఇల్లాలు  ప్రియుడు ముస్తఫా రాజ్ ను పెళ్లి చేసుకున్న ప్రియమణి గురువారం బెంగళూరులో రిసెప్షన్

 సెలెబ్రిటీలు ఎక్కువ శాతం ప్రేమ వివాహాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు తాజాగా ప్రముఖ నటి ప్రియమణి ఇల్లాలైంది.  గత కొంత కాలంగా గాఢంగా ప్రేమించిన తన ప్రియుడు ముస్తఫా‌రాజ్‌ తో పెళ్లి బుధవారం సింపుల్‌గా రిజిస్ర్టార్ ఆఫీసులో జ‌రిగింది. తాము విభిన్న మతాలకు చెందిన వాళ్లమ‌ని, అందుకే సంప్రదాయబద్ధంగా కాకుండా రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుంటున్నామ‌ని సినీన‌టి ప్రియ‌మ‌ణి ఇటీవ‌ల ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

 

 

ఈ పెళ్లికి ఆమె కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. వీరి రిసెప్ష‌న్ మాత్రం రేపు సాయంత్రం బెంగ‌ళూరులో ఘ‌నంగానే జ‌ర‌గ‌నుంది. ఇక  సంగీత్‌, మెహందీ ఫంక్షన్‌లో తీసిన ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రియమణి రెడ్ కలర్ దుస్తుల్లో మెరిసింది. ఈ జంట ఆగ‌స్ట్ 24న రిసెప్షన్ ఏర్పాటు చేసింది.

 

బెంగ‌ళూరులో గురువారం సాయంత్రం జ‌ర‌గ‌నున్న ఈ కార్యక్రమానికి టాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్ నుంచి నటీనటులు హాజ‌రుకానున్నారు.ఇక రిసెప్షన్ జరిగి రెండురోజుల తర్వాత ఈ అమ్మడు షూటింగ్‌కి వెళ్ళనుంది. మోలీవుడ్‌లో నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంది. ఇంతకీ హనీమూన్ ఎక్కడంటూ సినీ లవర్స్ ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే
అఖండ 2 లో బాలయ్య కంటే 48 ఏళ్లు చిన్న నటి ఎవరో తెలుసా? ఐదుగురు హీరోయిన్ల ఏజ్ గ్యాప్ ఎంత?