కన్ను కొట్టి 5 కోట్లు కొల్లగొట్టిందిగా...

Published : Mar 10, 2018, 11:53 AM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
కన్ను కొట్టి 5 కోట్లు కొల్లగొట్టిందిగా...

సారాంశం

ప్రియా ప్రకాష్ వారియర్ సృష్టించిన అలజడి ఇప్పటికీ చల్లారలేదు కనుబొమ్మలతో ఆమె ఆడించిన ఆట నెల రోజులు దాటినా ఆడుతూనే వుంది​ ధనుష్-అనిరుధ్’ కొలవెరి పాటను సైతం ప్రియా ‘పడుచు ఆట’ కుమ్మేసిందన్నట్టేగా​

మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్ సృష్టించిన అలజడి ఇప్పటికీ చల్లారలేదు. కనుబొమ్మలతో ఆమె ఆడించిన ఆట నెల రోజులు దాటినా ఆడుతూనే వుంది. యూట్యూబ్ లో ‘వింక్ గాళ్’ వీడియో సరికొత్త రికార్డ్ సృష్టించినట్లు ఆన్లైన్ ‘చరిత్ర’ చెబుతోంది. ‘ఒరు అదార్ లవ్’ మూవీలోని ‘మాణిక్య మలరయ పూవి’ అంటూ సాగే ఒక రొమాంటిక్ సాంగ్ కి ప్రియా చేసిన ఐఫీట్స్ దేశవ్యాప్తంగా నెటిజన్లు ఫ్లాట్ అయ్యారు. ఎంతలా అంటే.. ఇప్పటికీ ఆ వీడియోను రీప్లే కొట్టికొట్టి చూసుకునేంతలా? కేవలం 28 రోజుల్లో 50 మిలియన్లు.. అంటే 5 కోట్ల వ్యూస్ దక్కించుంది ఈ ‘అభినవ దృశ్యకావ్యం’. దక్షిణాది నుంచి విడుదలైన ఏ ఆన్లైన్ వీడియో కూడా ఇంత స్కోర్ చేయలేదట! సో.. ‘ధనుష్-అనిరుధ్’ కొలవెరి పాటను సైతం ప్రియా ‘పడుచు ఆట’ కుమ్మేసిందన్నట్టేగా!

                                                  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు