ప్రైవేట్‌ వీడియోలు లీక్‌ చేశాడంటూ నిర్మాతపై హీరోయిన్‌ కేసు.. హాట్‌ టాపిక్..

Published : Aug 02, 2023, 06:32 PM IST
ప్రైవేట్‌ వీడియోలు లీక్‌ చేశాడంటూ నిర్మాతపై హీరోయిన్‌ కేసు.. హాట్‌ టాపిక్..

సారాంశం

తన ప్రైవేట్‌ వీడియోలు, ఫోటోలను సోషల్‌ మీడియాలో లీక్‌ చేశాడంటూ నిర్మాతపై నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా ఈ విషయం హాట్‌ టాపిక్‌ గా మారింది. 

తన ప్రైవేట్‌ వీడియోలను, ఫోటోలను లీక్‌ చేశాడంటూ నటి ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఓడియా(ఒరిస్సా)కి చెందిన నటి శీతల్‌ పాత్ర .. తన ప్రైవేట్‌ వీడియోలను, చిత్రాలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడంటూ నిర్మాత దయానిధి దహిమాపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అసలు వ్యవహారం బయటపడింది. ఇప్పుడిది హాట్‌ టాపిక్‌ అవుతుంది.

ప్రారంభంలో నిర్మాత దయానిధి దహిమా, నటి శీతల్‌ పాత్ర మధ్య మంచి అనుబంధం ఉంది. కలిసి పనిచేయడంతో సన్నిహిత్యం ఏర్పడింది. అది కాస్తా ఫిజికల్‌ రిలేషన్‌ షిప్‌ వరకు వెళ్లింది. అప్పటి వరకు బాగానే ఉంది. కానీ ఆమె ఇతర మేకర్స్ తో పనిచేయాలని నిర్ణయించుకుంది. దీంతో ఇద్దరి మధ్య చెడింది. అది కాస్త గొడవలకు కారణమయ్యింది. ఈ ఏడాది మార్చిలో తాను దీనిపై స్పందిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇందులో సైబర్‌ బెదిరింపులు, నకిలీ వార్తాలను సృష్టించడం నేరం, అనేక నకిలీ ఖాతాలను సృష్టించడం దయా ఎంటర్టైన్‌మెంట్స్ కి చెందిన దయానిధి దహిమా నకిలీ వార్తలను సృష్టించాడని ఒప్పుకున్నాడు. 

ఇది చాలా మందికి వినోదంగా ఉన్నప్పటికీ ఏ మహిళకైనా ఇది ఎంత బాధాకరంగా ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆర్టిస్టులందరూ మహిళలందరూ తదుపరి ఎవరితో పనిచేస్తారో, ఏ విధంగా సహకరిస్తారో జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థిస్తున్నాను. మహిళలకు అండగా నిలిచినందుకు  ఒడిసా పోలీస్‌, సైబర్‌ పోలీస్ లకు, డీసీపీకి ఆమె ధన్యవాదాలు తెలిపింది.

ఈ క్రమంలో ఇప్పుడు ఆయనపై పోలీస్‌ కేసు పెట్టింది. జులై 28న భువనేశ్వర్‌లోని లక్ష్మి సాగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది శీతల్‌. దయానిధి తనను లైంగిక, మానసిక వేధింపులకు పాల్పడ్డాడని పేర్కొంది. తనను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడని, తనకు ఇచ్చిన పారితోషికం తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాడని ఫిర్యాదులో తెలిపింది. అతను తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని పోలీసులకు వెల్లడించింది. 

అంతేకాదు తాను చదివే కాలేజ్‌లో విద్యార్థుల ముందే తనపై యూనిఫామ్‌ చించేశాడని, తనకు తీవ్రమైన అవమానానికి గురి చేశాడని వెల్లడించింది. తన ప్రతిష్టని దిగజార్చడానికి సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాడని, తన ఫ్యామిలీని కూడా కించపరిచేలా వ్యవహరిస్తున్నారని ఆమె పేర్కొంది. అదే సమయంలో తాను గత కొన్నేళ్లుగా నిర్మాతతో సహజీవనం చేసినట్టు చెప్పింది. అందుకే తనని మోసం చేశాడని ఆమె ఆరోపిస్తుంది.

దీనిపై ఆమె వివరణ ఇస్తూ, మొదట తనతో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేసేవాడు, అప్పుడు వాటిని పట్టించుకోలేదు. అతను ఉద్దేశ్యపూర్వకంగానే ఇలా చేస్తున్నాడని ఊహించలేదు. అతన్ని పూర్తిగా నమ్మాను. ఆయనతో సినిమా కూడా చేశాను. సినిమాకి పారితోషికం కూడా ఇవ్వలేదు. అప్పట్నుంచి మా మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత నన్ను చాలా అసభ్యంగా దూషించాడు, ఇప్పుడు ఏకంగా నా ప్రైవేట్‌ వీడియోలు, ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు` అని పేర్కొంది. దీంతో నిర్మాత దయానిధిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శీతల్‌ పాత్ర మరో నిర్మాతతో సినిమాలు చేసేందుకు వెళ్లడంతో దయానిధి ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని తెలుస్తుంది. తనతోనే సినిమాలు చేయాలని అతను ఒత్తిడి తెస్తున్నాడని, వినకపోవడంతో ఇంత పని చేశాడని ఆమె వెల్లడించారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

పూసలమ్మిన మోనాలిసా ఎంతగా మారిపోయిందో చూశారా
ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాల్సిన సినిమా, కానీ ఫ్లాప్..హీరోని తలుచుకుని రోజూ బాధపడే డైరెక్టర్ ఎవరంటే