Tarun: మెగా డాటర్‌తో పెళ్లి..? క్లారిటీ ఇచ్చిన హీరో తరుణ్‌

Published : Aug 02, 2023, 01:34 PM ISTUpdated : Aug 02, 2023, 01:48 PM IST
Tarun: మెగా డాటర్‌తో పెళ్లి..? క్లారిటీ ఇచ్చిన హీరో తరుణ్‌

సారాంశం

చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న హీరో తరుణ్‌.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా దీనిపై తరుణ్‌ స్పందించారు.

టాలీవుడ్‌లో లవర్‌ బాయ్‌గా పేరుతెచ్చుకున్నారు తరుణ్‌. బాల నటుడిగా చిత్ర పరిశ్రమకి పరిచయం అయిన ఆయన హీరోగా పలు సూపర్‌ హిట్లు అందుకున్నారు. ముఖ్యంగా లవ్‌ స్టోరీస్‌తో సక్సెస్‌ కొట్టాడు. ఆ టైమ్‌లో అత్యంత క్రేజ్‌ ఉన్న హీరోగా, అమ్మాయిల ఫాలోయింగ్‌ ఉన్న హీరోగా నిలిచారు. ఇటీవల కాలంలో ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. చాలా కాలంగా తరుణ్‌ సినిమాలు చేయడం లేదు. రీఎంట్రీ ఇస్తున్నారనే వార్తలొచ్చాయి, కానీ ఇప్పటి వరకు క్లారిటీ లేదు. 

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. దీనికితోడు తన తల్లి ఆ మధ్య తరుణ్‌కి పెళ్లి చేయబోతున్నామనే కామెంట్లు కూడా చేసింది. దీంతో అనేక రూమర్స్ ఊపందుకున్నాయి. తరుణ్‌.. మెగా డాటర్‌ని పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలొచ్చాయి. నిహారికాతో ఆయన వివాహం జరుగుతుందనే కథనాలు వచ్చాయి. సోషల్‌ మీడియాలో ఇవి వైరల్‌గా మారాయి. నిహారిక ఇటీవల తన భర్త చైతన్య నుంచి విడాకులు తీసుకుంది. కోర్ట్ నుంచి కూడా విడాకులు వచ్చాయి. దీంతో ఇప్పుడు ఆమె సింగిల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో తరుణ్‌తో పెళ్లికి రెడీ అవుతున్నట్టు కథనాలు చక్కర్లు కొట్టాయి. 

ఇవి తారాస్థాయికి చేరడంతో దీనిపై తాజాగా స్పందించారు. పెళ్లిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తరుణ్‌ మాట్లాడుతూ... ఈ ప్రచారం నిజం కాదు అని తేల్చి చెప్పారు. నిజంగా తాను ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే నిరభ్యంతరంగా సోషల్ మీడియా వేదికగా, మీడియా ముఖంగా ఆ విషయం చెబుతానని, తన పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదని అన్నారు. ఈ వార్తలను నమ్మవద్దని, అది వాస్తవం కాదన్నారు తరుణ్‌. మొత్తానికి పుకార్లకి చెక్‌ పెట్టారు తరుణ్‌. 

సీనియర్‌ నటి రోజా రమణి తనయుడు తరుణ్‌. దీంతో బాలనటిగా సినిమాల్లో రాణించారు. బాలనటుడిగా `అంజలి` చిత్రంతో ఏకంగా జాతీయ అవార్డుని అందుకున్నారు. `ధళపతి`, `సూర్య ఐపీఎస్‌`, `పిల్లలు దిద్దిన కాపురం`, `అభయం, `ఆదిత్య 369`, `తేజ` చిత్రాలతో ఆకట్టుకున్నాడు. `జానీ` చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. కానీ `నువ్వే కావాలి` సినిమాతో హీరోగా బ్రేక్‌ అందుకున్నాడు.

`ప్రియమైన నీకు`, `అదృష్టం`, `నువ్వే నువ్వే`, `నిన్నే ఇష్టపడ్డాను`, `ఎలా చెప్పను`, `నువ్వు లేక నేను లేను`, `చిరుజల్లు`, `నీ మనసు నాకు తెలుసు` చిత్రాలతో మెప్పించాడు. `సఖియా`, `సోగ్గాడు` చిత్రాలుసైతం మంచివిజయాలు అందుకున్నాయి. ఆ తర్వాత ఆయన కెరీర్‌ ట్రాక్ తప్పింది. `నవ వసంతం`, `భలే దొంగలు`, `శశిరేఖ పరిణయం`, `చుక్కలాంటి అమ్మాయి చక్కనైనా అబ్బాయి`, `యుద్ధం`, `వేట` చిత్రాలు వరుసగా పరాజయం చెందాయి. 

మధ్యలో కొంత గ్యాప్‌ తీసుకున్నాడు తరుణ్‌. ఆర్తి ఆగర్వాల్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. దీంతో సినిమాలపై ఫోకస్‌ చేయలేదు. దీంతో కెరీర్‌ ట్రాక్ తప్పింది. వరుస పరాజయాలతో సినిమాలకు దూరమయ్యారు. మళ్లీ సినిమాలవైపు వస్తారన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యాడని రూమర్స్ రావడం ఆశ్చర్యపరిచింది. అదికూడా మెగా డాటర్‌ తో అంటూ వచ్చిన వార్తలు సంచలనంగా మారాయి. దీంతో తాజాగా ఆయన వివరణ ఇచ్చారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా