
ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో, అలాగే భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నటిస్తున్నాడు. వక్కంతం వంశీ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.ఈ చిత్రానికి ఇటీవలే ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ తో సర్ప్రైజ్ చేసారు.
తాజాగా ఫ్యాన్స్ ని అలరించే విధంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసారు. అరె బ్లాక్ అండ్ వైట్ సీతాకోక చిలుకవా.. చీకట్లో తిరగని తళుకువ ఒక ముళ్లు కూడా లేనే లేని రోజా పువ్వా రేర్ పీసే నువ్వా.. అంటూ క్యాచీగా ఉండే లిరిక్స్ తో సాగుతున్న ఈ సాంగ్ రిఫ్రెషింగ్ గా వినసొంపుగా ఉంది. ఈ చిత్రానికి హ్యారిస్ జైరాజ్ సంగీతం అందించారు. కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు.
ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్స్‌తో తెలుగు ప్రేక్షకులను మైమరపింప చేసిన మ్యూజికల్ జీనియస్ హారిస్ జైరాజ్ మరోసారి తనదైన స్టైల్లో ‘డేంజర్ పిల్ల..’ సాంగ్‌కు వండర్‌ఫుల్ ఫుట్ ట్యాపింగ్ బీట్‌ను అందించారు.అర్మాన్ మాలిక్ ఈ సాంగ్ ని వినసొంపుగా పాడారు.
శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. నితిన్ ఇప్పటి వరకు చేయనటువంటి పాత్రలో ఆకట్టుకోబోతున్నారని, కచ్చితంగా ఆయన అభిమానులనే కాదు, ప్రేక్షకులను కూడా నితిన్ తన బ్రిలియంట్ పెర్ఫామెన్స్‌తో మెప్పించనున్నారు. క్యారెక్టర్ బెస్ట్ స్క్రిప్ట్‌తో.. కిక్ తర్వాత ఆ రేంజ్ జోన్‌లో తెరకెక్కుతోంది. ఆడియెన్స్‌కి రోలర్ కోస్టర్‌లాంటి ఎక్స్‌పీరియెన్స్‌నిస్తూ నవ్విస్తూనే సర్‌ప్రైజ్‌లతో సినిమా మెప్పించనుంది’’ అని డైరెక్టర్ వక్కంతం వంశీ అన్నారు. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్యమూవీస్ & ఎంటర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.