బెంగళూర్ ఎయిర్ పోర్ట్ లో సదుపాయాలపై నటుడు మాధవన్ ట్వీట్, స్పందించిన ప్రధాని మోది.

Google News Follow Us

సారాంశం

బెంగళూరు ఏయిర్ పోర్ట్ గురించి ట్వీట్ చేశారు... ప్రముఖ నటుడు మాధవన్. ఆయన శేర్ చేసిన వీడియో వైరల్ అవ్వడంతో పాటు.. మాధవన్ పెట్టిన  పోస్ట్ కు  సర్ ప్రైజింగ్ రిప్లై ఇచ్చాడు ప్రదాని నరేంద్ర మోది. ఇంతకీ ఏమాన్నారంటే..? 

బెంగళూరు ఏయిర్ పోర్ట్ గురించి ఓవీడియోపోస్ట్ చేశారు ప్రముఖ నటుడు మాధవన్.  కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌పై నటుడు మాధవన్ ప్రశంసలు కురిపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మాధవన్ పెట్టిన పోస్టుపై ప్రధాని మోడీ కూడా స్పందించారు. ఇంతకీ ఏమన్నారంటే..? నటుడు, రైటర్, డైరెక్టర్ ఆర్.మాధవన్ రీసెంట్ గా  బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ కు వెళ్లారు. ఏదో ప్రయాణం నిమిత్రం ఎయిర్ పోర్ట్ కు వెళ్లిన ఆయన అక్కడ కొత్తగా తెరిచిన టెర్మినల్‌ ను చూసి షాక్ అయ్యారు. అంతే కాదు అక్కడి  మౌలిక సదుపాయాలపై  ముగ్ధులయ్యారు. 

బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పై ప్రశంసలు కురిపించారు మాధవన్. ఈ ఎయిర్ పోర్ట్ లో ఉంటే తనకు  విదేశాల్లో ఉన్న ఫీలింగ్ కలిగిందంటూ  ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లో (actormaddy) పోస్టు పెట్టారు.  ఆయన పెట్టిన వీడియోలో ఇలా మాట్లాడారు... నేను కొత్త కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్నాను. విదేశాల్లో ఉన్న ఫీలింగ్ కలుగుతోంది.. ఎవరు నమ్మలేరు ఇది విమానాశ్రయం అంటే. భారతదేశంలో మౌలిక సదుపాయాలు చూస్తుంటే నమ్మశక్యం కావడం లేదు అన్నారు. 

 

అంతే కాదు... ఎయిర్‌పోర్ట్‌లో వేలాడుతున్న మొక్కలు చూపిస్తూ.. ఇవన్నీ నిజమైన మొక్కలు. పైన ఇంకా నిర్మాణాలు చేసారు.. అన్నీ అద్భుతంగా ఉన్నాయి అంటూ వీడియోలో వాటిని చూపిస్తూ.. ప్రశంసించారు. బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. అత్యుత్తమమైనది. మౌలిక సదుపాయాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవి.. చాలా గర్వంగా ఉంది.. అంటూ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు మాధవన్. అయితే మాధవన్ పోస్ట్ పై తాజాగా స్పందించారు ప్రధాన మంత్ర నరేంద్ర మోది. భారతదేశ వృద్ధికి నెక్స్ట్ జెన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అని ప్రధాని మోడీ రిప్లై చేసారు. విదేశీ విమానాశ్రయాల కంటే భారతీయ విమానాశ్రయాలు చాలా మెరుగ్గా ఉన్నాయంటూ నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు. 

ఇక మాధవన్ పోస్ట్ లు డిఫరెంట్ తా ఉంటాయి. తనకు సంబంధించిన విషయాలతో పాటు సమాజాంలో జరిగే వాటిని కూడా పోస్ట్ ల రూపంలో పెడుతుంటాడు మాధవన్. ఇక ఎక్కువగా తన కొడుకు సాధించి విజయాలు. స్విమ్మింగ్ లో సాధించిన అంతర్జాతీయ ఘనతల గురించి ఎప్పుడూ చెపుతుంటాడు. తాజాగా మధవన్ పెట్టి పోస్ట్ వైరల్ అవుతోంది. 

Read more Articles on